చంద్రగిరి పాలిటిక్స్.. వెరీ హీట్?

Purushottham Vinay
చంద్రగిరి అల్లర్ల పై ఒక్కో పార్టీ నుంచి ఒక్కో వాదన విపిస్తుంది.మే 13, 14 వ తేదీన జరిగిన ఘటనలపై తిరుపతి, చంద్రగిరి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయి అరెస్టులు జరిగాయి. సిట్ విచారణ  కూడా జరుగుతోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీస్ పికెట్లు కొనసాగుతుండగా నివురుగప్పిన నిప్పులాగా పరిస్థితి మారింది. కేంద్ర పారా మిలిటరీ బలగాలు సైతం మొహరించాయి. ఎన్నికల కమిషన్ కూడా చంద్రగిరి అల్లర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇలా చంద్రగిరి అల్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా అవ్వగా, మరోవైపు అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, పిర్యాదులు చేసుకుంటున్న వైసీపీ ఇంకా టీడీపీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.4 రోజుల క్రితం తిరుపతి SVU పోలీస్టేషన్ లో సిట్ విచారణకు హాజరైన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఘటనపై DSP రవి మనోహరాచారికి వివరించడం జరిగింది. మే 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై తీరును ఆయన వివరించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజ్‌ను DSPకి అందజేసిన నాని ఇంకా అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు.


కేసుల్లో A1 నుంచి A9 దాకా దాడికి పాల్పడిన నిందితులు ఉన్నారని, మిగిలిన వారంతా అమాయకులన్న నాని భౌతికంగా లేకుండా చేసేందుకు చంపాలని చూసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు ఇంకా భానుకుమార్ లేనన్నారు. అసలు పాత్రధారులు, సూత్రధారులను వదిలేశారన్న నాని 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించడం జరిగింది. ఇక హత్యాయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు పులివర్తి నాని.ఇక చంద్రగిరి అల్లర్లపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలవడం జరిగింది. పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేస్తున్న ఆరోపణలపై ఎస్పీకి వివరించిన చెవిరెడ్డి, అనంతరం చంద్రగిరి ఇంకా తిరుపతిలో జరిగిన అల్లర్లపై మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.


 గొడవలకు సంబంధించిన వీడియోలను డిస్ ప్లే చేసి ఘటనల తీరును వివరించడం జరిగింది. పైగా నాని భార్య కూడా మహానటిలా నటించిందని వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. నామినేషన్ సమయంలో RDO ఆఫీసు వద్ద తన కారుపై దాడి చేశారన్న చెవిరెడ్డి, కూచివారిపల్లిలో చిన్న గొడవను అడ్డంపెట్టుకుని దాడులు చేశారని అన్నారు. వైసీపీ నేత ఇల్లుతో సహా రెండు కార్లని ద్వంసం చేశారన్నారు. అలాగే ఒక అబ్బాయిని కొట్టారన్నారు చెవిరెడ్డి. ఇంకా మహిళ యూనివర్సిటీలో నానిపై దాడి చేయాలన్న ఉద్దేశం భానుది కాదన్నారు చెవిరెడ్డి. జరిగిన దాడిలో నానికి ఎలాంటి గాయాలు కాలేదని, రెండు గంటల తర్వాత వీల్ చైర్ లో ఉన్నాడన్నది  డ్రామా అన్నారు చెవిరెడ్డి. అసుపత్రిలో ఫేస్ మాస్క్ లు, వెంటిలేటర్ ను ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాలేదన్న చెవిరెడ్డి గొడవల్లో అమాయకులు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: