జగన్: ఫలితాలు రాకముందే ఢిల్లీ నుంచి బంపర్ ఆఫర్..!

Divya
జాతీయస్థాయిలోని ఎన్నికలు  దృష్ట్యా ఇప్పుడు అందరూ ఏపీ వైపుగా చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్  ఎన్నికలు కూడా జరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా జాతీయస్థాయి మీడియాలో కూడా ఏపీ వైపు గానే ముగ్గు చూపాయి. ముఖ్యంగా వైసిపి టిడిపి గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తామంటే తాము వస్తామంటే చాలా బలంగా రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. సీఎం జగన్ అయితే ఏకంగా 151 యొక్క స్థానాల కంటే అధికంగా వస్తాయని తెలియజేశారు.

ఐదే గత ఎన్నికలలో బిజెపికి దగ్గరైన జగన్.. ఎన్డీఏ పార్టీలోకి మాత్రం చేరలేదు ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత ఓడిపోయారు. రాజ్యసభలో బిజెపి పార్టీకి ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో ఎన్నోసార్లు జగన్ పార్టీ అన్ని విధాల సహకరించింది. కానీ ఈసారి ఎన్నికల సమయానికి బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కేవలం ఒక్క జగన్ ను ఓడించడానికి ఇలా అందరూ ఏకమయ్యారు. అయినా కూడా గెలుస్తామని నమ్మకం కూటమిలో కనిపించలేదు.

ఇలా రకరకాల చర్చలు నడుస్తున్న సమయాల్లో ఒకవేళ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి మెజారిటీ పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటే ఖచ్చితంగా జగన్ కీలకంగా మారుతారని విషయం ఇప్పుడు వినిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో బిజెపికి అవసరమైన మెజారిటీ కూడా దక్కకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే అటు కాంగ్రెస్ ,బిజెపి నుంచి వైసీపీ పార్టీకి ఆఫర్లు వెలుబడుతున్నాయట.. కానీ జగన్ ఎవరు పక్షాన నిలబడతారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఏపీ ప్రజల బాగు కోసమే జగన్ కచ్చితంగా ఎవరైతే ప్రత్యేక హోదాను ఇచ్చి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణం చేయకుండా ఆపుతారో అలాగే అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కి  సహకరిస్తామని ప్రకటన చేసిన తర్వాతే ఆలోచిస్తామని కూడా తెలియజేసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఏపీ రాజకీయాలు జాతీయ రాజకీయాలని మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: