విశాఖ: టీడీపీ సీనియర్ నేతలకు ఓటమి భయం?

Purushottham Vinay
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణలు ఇవే తమకు చివరి ఎన్నికలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. అసలు ఈ ఎన్నికల తర్వాత తాము రాజకీయాల్లో ఉండేది లేదని కూడా చెప్పుకుంటూ ఊళ్ళలో బాగా ప్రచారం చేసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని వారు ప్రకటించారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి, బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి, కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది.అయితే ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయని ఆ సెగ్మెంట్లలోని ప్రజలు లెక్కలేసి చెబుతున్నారు.ఈ నలుగురు నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలం గత ఎన్నికల కంటే బాగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైసీపీకి బాగా ఓట్లు వేశారు.


వైఎస్ జగన్ మీద ప్రజల్లో ఉన్న నమ్మకంతోనే నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయి. అందువల్ల ఈ నలుగురు నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇవే తమకు చివరి ఎన్నికలని చెప్పుకుని ప్రజల్లో ప్రచారం చేసినా వారికి లభించిన మద్దతు కేవలం నామ మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇదే అంశం స్పష్టం అయ్యింది.అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభను, బస్సు యాత్ర సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలు కూడా ఊహించిన దానికంటే బాగా విజయవంతమయ్యాయి.అందుకే గంటా, అయ్యన్న, బండారు, కొణతాల వంటి నేతలు తమకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకు తిరిగినా కూడా అసలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. వారికి ఎదురైన నిరాదరణతోనే తీవ్రమైన భయం మొదలైంది. చివరగా పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే ఆందోళన వారిలో బలంగా కనిపిస్తోంది.మరి చూడాలి జూన్ 4 వ తేదీన ఏమి జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: