నర్సాపురంలో టీడీపీ విఫలం.. వైసీపీ సఫలం..?

Purushottham Vinay
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో వైఎస్‌ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని బలంగా నమ్ముతూ ఎంతో నమ్మకంగా విజయం సాధిస్తామని చెబుతున్నారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు వేగంగా ఉంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లో కూడా ఫ్యాన్‌ పార్టీ అభ్యర్థులే ఖచ్చితంగా విజయం సాధించనున్నారు. దానికి కారణం వైసీపీ అభివృద్ధి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు ఇంకా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం ఇంకా అలాగే కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. అది టీడీపీకి మైనస్ గా మారి వైసీపీకి ప్లస్ అయ్యింది. 


సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు.ఆ జిల్లాలో ఏకంగా 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా నాణ్యమైన ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు జనాలని వైసీపీ పై మల్లించాయి.సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను జనాల చెంతకు చేర్చారు. జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అందువల్ల వైసీపీ సఫలం ఐయింది. ఖచ్చితంగా గెలవబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: