టీడీపీ కంచుకోటని ఊపేస్తోన్న వైసీపీ ఫ్యాన్ గాలి?

Purushottham Vinay
టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో ఫ్యాన్  గాలి బాగా వీస్తుందని సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని తెలుస్తుంది.ముఖ్యంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం అనేది చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో ఏకంగా 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అయితే అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా ఇంకా ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి చాలా ఎక్కువగా తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో ఏకంగా 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ మహా నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్‌కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే పెరిగింది. ఇంకా అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఏకంగా 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు ఇంకా మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ కూడా పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు కూడా మారాయి. ప్రతి ఊరిలో  బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి.అలాగే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి.సీఎం జగన్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: