కేంద్రంలో బిజెపి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు వీళ్లేనా..?

Pandrala Sravanthi
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 1 నాటికి పూర్తిగా ఎన్నికలు అనేవి ముగుస్తాయి. దేశం మొత్తం రిజల్ట్ జూన్ 4వ తేదీన బయటకు రానుంది. ఇదే తరుణంలో ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు పర్యాయాలు బిజెపి కొనసాగిస్తూ వస్తోంది. ఈసారి 400కు పైగా సీట్లు మావేనని  బిజెపి చెప్పుకుంటూ వస్తోంది. ఈసారి బిజెపి అధికారంలోకి వస్తే మన తెలుగు రాష్ట్రాలపై వారు ఎక్కువ దృష్టి పెట్టె అవకాశం కనిపిస్తుంది. 

ఇదే తరుణంలో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన వారికి ఎక్కువ మంత్రి పదవులు ఉంటాయని , ఇలా మంత్రి పదవులు కేటాయించడం వల్ల రాష్ట్రాలపై బీజేపీ పట్టు సాధించవచ్చని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి ఆలోచనలో భాగంగా, ఈసారి తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ నుంచి  విజయం సాధించిన వారికి మెజారిటీ మంత్రి పదవులు రానున్నాయట. మరి వారెవరు అనే వివరాలు చూద్దాం..తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురికి తగ్గకుండా కేంద్ర మంత్రి పదవులు ఉంటాయట. వీరిలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక మహిళ, ఒక ఎస్సికి,  తప్పనిసరిగా ఉంటారని బిజెపి సాంకేతాలిస్తుందట.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు.  సికింద్రాబాద్ నుంచి ఈసారి కిషన్ రెడ్డి గెలిస్తే మరోసారి ఆయన మంత్రి అవుతారు. అంతేకాదు మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ గెలిస్తే ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఆరూరి రమేష్, అంతేకాకుండా గౌడ సామాజిక వర్గం నుంచి భూర నరసయ్య గౌడ్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో బిజెపి నుంచి విజయం సాధించిన చాలామందికి కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉన్నట్టే తెలుస్తోంది. ఇంకా ఏపీ విషయానికి వస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పురందేశ్వరిలు,  గెలిస్తే తప్పక కేంద్ర పదవి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: