కీలక సమయంలో వైసీపీకి కిక్కిచ్చే న్యూస్..??

Suma Kallamadi
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కు చెందిన సెఫాలజిస్టు సంజీవ్ కుమార్ ని ఈనాడు ఇటీవల ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ CSDS కన్వీనియర్ ఒక సర్వేను మెన్షన్ చేస్తూ దాని ప్రకారం టీడీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని అన్నారు. అయితే వైఎస్ఆర్సిపి వాళ్లు ఒక కోఆర్డినేటర్ ని పట్టుకున్నారు. సంజీవ్ కుమార్ ఏ సర్వే పేరు చెప్పి టిడిపి గెలవబోతోంది అని చెప్పారో ఆ సర్వే వాళ్ళు స్పందించారు. తమసలు టీడీపీ గెలవబోతుందని చెప్పలేదని, వైసీపీ మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది అని తాము భావిస్తున్నామని, అది కూడా తమ సర్వే ఫలితాల ఆధారంగా చెబుతున్నామని చెప్పుకొచ్చారు.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది ఆ రోజే ఎవరు గెలుస్తారనేది చేరుతుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త సర్వేలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు రెండు నాలుకల ధోరణితో ప్రవర్తిస్తున్నాయి. ఏదో ఒకటి కచ్చితంగా నిజం అవుతుంది కాబట్టి రెండు అంచనాలను చెబుతున్నాయి.  ఢిల్లీ సీనియర్ జర్నలిస్టు సురేష్ గతంలో కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు ఆయన చెప్పినట్లే ఈ రెండు చోట్ల కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేసింది.
అయితే ఆయన ఇప్పుడు ఏపీ ఎన్నికలపై కూడా ఒక సర్వే ఇచ్చారు ఆ సర్వే ప్రకారం వైసీపీ 128 నుంచి 140 లోపు సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుంది. ఆయన ఇచ్చిన సర్వే వల్ల వైసీపీ నేతలు సంతోషిస్తున్నారు. గెలుస్తుందో గెలవదో అనే ఒక భయంలో ఉన్న వైసీపీ నేతలకు ఈ న్యూస్ ఒక కిక్, బూస్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే జూన్ 4వ తేదీన అధికారికంగా ఎవరు గెలుస్తారనేది ప్రకటించనున్నారు. జగన్ ఆల్రెడీ ఇంకేలు ఇస్తానని డిమాండ్ స్పష్టంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం జనాల ముందుకు వచ్చి బహిరంగ ప్రకటన చేయలేదు. సో వాళ్లు కూడా ఓడిపోతున్నామని అనుకుంటూ ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: