ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న మాజీ మంత్రి మనవరాలు..??

Suma Kallamadi
పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓడిపోతారని పలాసలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఓడిపోవాలని వైఎస్సార్సీపీ నేతలు కూడా కోరుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్రి పదవి వల్ల అహంకారిగా ఆయన మారారట. ఇక పలాస ప్రజలు కూడా టీడీపీకి పట్టం కట్టారని అంటున్నారు. పలాస నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుని చూసి కాకుండా వైఎస్‌ జగన్‌ను చూసి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోయినసారి జగన్ పుణ్యమా అని ఎలాగోలా గెలిచాడు కానీ ఈసారి ఆయన కలవడం గగనమే అని అంటున్నారు.
గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన సిదిరి శాతం ఓట్లు సాధించి వావ్ అనిపించారు. మంత్రి అయ్యాక ఆయన అహంకారం బాగా పెరిగిపోయింది. ఇదే అతడి ఓటమికి కారణమవుతుందని సొంత పార్టీ నేతలే వెల్లడిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష రాజకీయ రణరంగంలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో శిరీష ఎన్నికల బరిలో నిలవగా, ఆమెకు ప్రత్యర్థిగా ఆ ప్రాంతంలో కొంత పేరున్న సీదిరి అప్పలరాజుకు వైసీపీ పోటీ చేసే అవకాశాన్ని అందించింది.
అప్పలరాజు ఆమె భర్తను దూషిస్తూ ఆ ఎన్నికల్లో ఆమెను ఓడించాలని చాలా వ్యూహాలు పన్నారు. శిరీష కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కట్ చేస్తే టీడీపీకి కంచుకోటగా ఉన్న పలాసలో వైసీపీ జెండా ఎగరవేసింది.
ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ సెపరేట్‌గా కంటెస్టు చేశాయి. ఈ రెండు పార్టీలు కలిపి 5.11 శాతం ఓట్లు సాధించడం విశేషం. ఈసారి కలిసి పోటీ చేస్తుంది కాబట్టి టీడీపీ నాయకురాలు శిరీష అప్పలరాజును ఓడించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గౌతు శిరీష మంత్రి అక్రమాస్తులను బయటపెట్టి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలాగా చేశారు. కేసులు, సీఐడీ నోటీసులకు ఏమాత్రం ఆమె భయపడకుండా వైసీపీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించారు. అందుకే ఇలాంటి డైనమిక్ నేతకు పలాస ప్రజలు పట్టం కట్టి ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: