వైసిపి గెలిస్తే రోజాకు ఆ పదవి ఇవ్వనున్నారా..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముగిసాయి. అభ్యర్థుల భవితవ్యం మొత్తం  వివిప్యాట్లలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు అనే దానిపై క్లారిటీ వస్తుంది. ఈ క్రమంలోనే  చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. దీంతో వైసిపి అధినేత జగన్ కూడా 151 పైగా అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు స్థానాల్లో మాదే విజయం ఉంటుందని బాహటంగా చెప్పారు. అంతేకాదు ఆయన లండన్ లో చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా చర్చ సాగుతోంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు ఈసారి పదవులు ఇవ్వకుండా కొత్తవారికి ఇవ్వాలని జగన్ భావించినట్టు తెలుస్తోంది. అంతేకాదు  హ్యాట్రిక్ కొట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంలోనే  గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరి ఈ రోజాకు  వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఒక ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఆమెకు మంత్రి పదవి మాత్రం ఈసారి ఇవ్వరట. దానికి బదులుగా మరో పదవి ఇస్తున్నారని తెలుస్తోంది. మరి ఆ పదవి ఏంటి అనేది చూద్దాం..

 ఒకవేళ నగరిలో రోజా గెలిస్తే మాత్రం శాసనసభాపతిగా రోజాను నియమిస్తారని  తెలుస్తోంది. ఇదే గనక జరిగితే మాత్రం  రోజా చరిత్ర సృష్టించినట్టే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కోడెల శివప్రసాద్, రెండవసారి తమ్మినేని సీతారాం, మూడవసారి   శాసనసభ పతిగా రోజాను నియమించాలని జగన్ భావిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే మాత్రం  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి సభాపతి  పదవి దక్కించుకున్న మహిళగా రోజా రికార్డు లోకి ఎక్కుతుంది. కానీ రోజా నగరిలో ఈసారి  గెలవడం కష్టమే అని సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఆమె గెలిచి పదవిని అలంకరిస్తుందా ఓడిపోయి ఇంటి వద్ద కూర్చుంటుందా అనేది జూన్ 4న తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: