జగన్ Vs చంద్రబాబు: టఫ్ ఫైట్.. ఈసారి ఎవరికి ఓట్లు రాలతాయంటే?

Purushottham Vinay
ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఎవరూ ఊహించనంత టఫ్ ఫైట్ సాగుతుందని తెలుస్తుంది. అయితే.. ఈ టఫ్ ఫైట్ లో ఏమైన జరగొచ్చు. అందరూ అనుకున్నదల్లా జరగాలని ఏమీ లేదు. గత 2019 లో కూడా ఇలానే అనుకున్నారు. చాలా టఫ్ అన్నారు.ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పంచడం.. జగన్ ప్రజాసంకల్ప యాత్ర వంటివి ప్రభావం చూపిస్తున్నాయని.. కాబట్టి ఈ ఎన్నికలను అంచనా వేయడం అంత సులువు కాదని చాలా మంది విశ్లేషించారు. అయితే.. నిజానికి 2019 చాలా టఫ్ గా కనిపించినా..చివరకి మాత్రం ఏకపక్షంగానే ముగిసింది. చివరకు ఫలితం చూస్తే.. జగన్ వైసీసీ క్లీన్ స్వీప్ చేసింది. అసలు ఎవరూ ఊహించని విధంగా.. ఎవరూ అంచనా వేయలేని విధంగా కూడా.. వైసీపీ ఏకంగా 151 సీట్లు తెచ్చుకుంది.2019లో టఫ్‌ అనుకున్నారు కానీ అది కాస్తా.. లైట్ అయిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టఫ్ ఫైట్ గట్టిగానే నడుస్తుంది. అప్పటికీ ఇప్పటికి తేడా జనాలు చూశారు. జనాలు ఈ ఐదేళ్లు జగన్ పాలన చూశారు. కాబట్టి.. మరోసారి ఆయనను గెలిపించాలని అనుకునేవారు ఇంకా ఓడిపోవాలని కోరుకునే వారు ఉన్నారు. ఇక ఇంకోవైపు కూటమి పోటెత్తింది.


పైగా మూడు పార్టీలూ కలిశాయి. ప్రచారాన్ని కూడా ఓ రేంజ్ లో చేశాయి. మోడీ సహా కేంద్ర మంత్రులు కూడా ఏపీలో ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రస్తావించారు. వాటికి పరిష్కారం కూడా చూపిస్తామన్నారు.ఇలా చూసుకున్నప్పుడు.. కూటమి వైపు ఎందుకు ప్రజలు ఏకపక్షంగా మొగ్గు చూపించరనే ప్రశ్న కూడా మొదలైంది. పైగా చంద్రబాబు వస్తే.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నెలనెలా రూ1500 పంపిణీ.. వంటి హామీలు మహిళల్లోకి వెళ్లాయి. దీంతో ఈ ఎన్నికలు టఫ్ కాదని.. ఏకపక్షంగానే సాగి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు కానీ 2014 లో చంద్రబాబు పరిపాలన చూసిన వారు నెగటివ్ గా ఉన్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా వరకు హామీలు నెరవేర్చారు. మహిళలకి, బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారు. కానీ రాజధాని అభివృద్ధి విషయంలో ఇద్దరు నేతలు కూడా స్లో అయ్యారు. కాబట్టి ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఓట్లు రాలతాయి అనే విషయంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. కొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా ఓట్లు రాగా కొన్ని చోట్ల టీడీపీకి అనుకూలంగా ఓట్లు వచ్చాయని ఇండియా హెరాల్డ్ సర్వేలో తెలుస్తుంది. అందువల్ల ఈసారి వార్ వన్ సైడ్ అవుతుందా? అని చెప్పలేము. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: