బాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమిదే!

Reddy P Rajasekhar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత ఐదేళ్లలో రాజకీయాల గురించి ఎక్కడ ఎలాంటి కామెంట్లు చేయలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురైనా తారక్ మాత్రం ఆ ప్రశ్నల గురించి స్పందించలేదు. అయితే ఏపీ ఎన్నికలు పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా రాజకీయాలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం నందమూరి చైతన్యకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
 
తాజాగా బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ కు, టీడీపీకి సంబంధం లేదనే విధంగా కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని భావిస్తే సొంతంగా పార్టీ పెట్టడం ఎంతసేపని టీడీపీని రెండు ముక్కలు చేయడం ఎంతసేపని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు కొన్ని విలువలు ఉన్నాయని అలాంటి తప్పులు తారక్ చేయరని అభిమానులు భావిస్తున్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ప్రస్తుతం సినిమాలపై ఉందని ఇలాంటి తరుణంలో తారక్ టార్గెట్ గా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తర్వాత టీడీపీ అదే వైభవంతో కొనసాగాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆప్షన్ అని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయంలో ఇదే నిజమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
 
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని తారక్ పై ఎంతలా విమర్శలు చేస్తే టీడీపీకి అంతే నష్టమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు టార్గెట్ గా కూడా రాజకీయాలు జరగవచ్చని అయితే తారక్ అభిమానులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని నిపుణులు  చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ కావాలని కోరిన పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ టార్గెట్ గా జరుగుతున్న రాజకీయాల గురించి ఏ విధంగా స్పందిస్తారని కూడా తారక్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: