జూ.ఎన్టీఆర్: టిడిపి నేతలకు ఫ్యాన్స్ మాస్ వార్నింగ్.. లోకేష్ కే దెబ్బ.!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫలితాల సమీపిస్తున్న వేళ తెరమీదకు మరి కొన్ని వార్తలు కలిగిస్తున్నాయి. 2019 కంటే ఎక్కువ సీట్లు అందుకుంటామని వైసిపి పార్టీ ధీమా ఉన్నప్పటికీ కూటమినేతలలో కూడా తమదే అధికారం అంటూ లెక్కలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అనుభవంగా జూనియర్ ఎన్టీఆర్ తో టిడిపి బంధం పైన పలువురు టిడిపి నేతలు చేసిన వాక్యాలు అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి.

కొంతకాలంగా టిడిపి తో జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు.ఎక్కువగా సినిమాల పైన ఫోకస్ చేస్తూ ఉన్న ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అక్కడ ఒక ప్రమాదానికి గురి కావడంతో చివరిగా మహానాడు సభకు హాజరయ్యి పూర్తిగా టిడిపి పార్టీకి దూరంగా ఉన్నారు. 2014, 19 ఎన్నికలలో టిడిపి మద్దతుగా అసలు ప్రచారం చేయలేదు. ఎన్టీఆర్ మాత్రం తన పార్టీకి ఎప్పుడు మద్దతు అవసరం వచ్చిన కచ్చితంగా ఉంటానని గతంలో తెలియజేశారు. rrr సినిమా తర్వాత హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ కలవడంతో రాజకీయంగా మరో అంశాలు తెరపైకి వచ్చాయి.

అంతేకాకుండా వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి మద్దతుగా నిలుచలేదు. ముఖ్యంగా చంద్రబాబు ఏడ్చిన పరిస్థితి కూడా మొదలయ్యింది.దీనివల్ల గతంలో ఎన్టీఆర్ పైన చాలామంది నేతలు కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా కరెక్ట్ గా ఓటింగ్ పూర్తి అయిన తర్వాతే మళ్ళీ టిడిపి నేతలు ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నారు. తాజాగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు టిడిపి పార్టీతో ఏం సంబంధం లేదని 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా పార్టీ ప్రచారానికి కూడా రాలేద నీ ఎద్దేవ చేశారు.

దీంతో ఈ విషయం విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నేతలను ఏకీపారేస్తున్నారు.. ముఖ్యంగా ఓటింగ్ సమయంలో ఇలాంటి వాక్యాలు చేయవచ్చు కదా.. అసలు రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో తెలియని లోకేష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తున్నారని టిడిపి నేతల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.. ఒకవేళ ఈ ఎన్నికలలో టిడిపి పార్టీ ఓడిపోతే కచ్చితంగా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది.. లోకేష్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని.. కచ్చితంగా ఎన్టీఆర్ అవసరం ఉంటుందని ఫ్యాన్స్ సైతం టిడిపి నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్క మాట చెప్పుతే చాలు టిడిపి నేతలు సగం మంది బయటికి వస్తారని కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: