జ‌గ‌న్ స‌ర్కారుకు ఎంత మంది స‌ల‌హాదారులో తెలుసా..!

RAMAKRISHNA S.S.
- వైసీపీ స‌ర్కారుకు 42 మంది స‌ల‌హాదారులు
- 13 మంది స‌ల‌హాదారుల‌కు కేబినెట్ ర్యాంకు
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో అధికార పార్టీ వైసీపీ.. అధినేత, సీఎం జ‌గ‌న్ త‌ను పాల‌న ప్రారంభించిన నాటి నుంచి కూడా.. అనేక మంది స‌ల‌హా దారుల‌ను నియ‌మించుకున్నారు. అయితే.. వీరి సంఖ్య ఎంత ఉందో .. ఎవ‌రెర‌వ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చాలా మంది చేశారు. కానీ, కొంద‌రి పేర్ల‌ను ముఖ్య‌మంత్రి కార్యాలయం గోప్యంగా ఉంచింది. దీనికికార‌ణాలు ఏవైనా కూడా.. వారి విష‌యం.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఓ సంద‌ర్భంలో హైకోర్టు వ‌ర‌కు కూడా ఈ విష‌యం వెల్ల‌డం గ‌మ‌నార్హం.

నిజానికి మీడియా ముందు క‌నిపించే స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మాత్ర‌మే. కానీ, ఈయ‌న‌తో పాటు వివిధ విభాగాల‌కు.. ప్ర‌భుత్వం స‌ల‌హాదారుల‌ను నియ‌మించింది. వీరంద‌రూ క‌లిపి 42 మంది ఉన్నారు. ప్ర‌ధానంగా వీరంతా కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉన్న‌వారే. గ‌తంలో వైసీపీకి అండ‌దండ‌లు అందించిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీ అధికారంలో కి వ‌చ్చేందుకు వీరంతా త‌మ త‌మ వంతుగా చాలా క‌ష్ట‌ప‌డ్డారు.
అందుకే పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీరికి స‌ల‌హాదారులు గా ప్రాధాన్యం పెంచింది.

ఆ శాఖ, ఈ శాఖ, ఆ విభాగం, ఈ విభాగం అన్నతేడా లేకుండా అన్నిచోట్లా సలహాదారులను నియ‌మిం చారు. వీరిలో కొంద‌రు మాత్ర‌మే తెర‌మీద క‌నిపిస్తారు. కొంద‌రు తెర‌వెన‌కే ఉండి పోతూ ఉంటారు . వీరికి నెల‌కు రూ.3 లక్షలపైనే జీతం  ఉంది. దీనికితోడు ప్రభుత్వ వాహనం, ఇతర అలవెన్సులు కల్పించారు. 13 మందికిపైగా సలహాదారులకు కేబినెట్‌ ర్యాంకు ఇచ్చారు. అయితే.. ఈ సలహాదారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సలహాదారుల నియామకం విషయంలో విధానం రూపొందిస్తున్నామని, కేబినెట్ ఆమోదం తరువాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ, ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో వీరి నియామ‌క పిటిష‌న్ వీగిపోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: