రాయలసీమ: బాలయ్య గెలుపు ఈజీ కాదా.. దీపిక దెబ్బకు చెమటలే..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలలో భయం కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ , కాకుండా హిందూపూర్ లో నిలబడ్డ బాలయ్య పరిస్థితి ఏంటి అనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ జరిగిన సరళిని చూసిన తర్వాత.. బాలయ్య ఈసారి హ్యాట్రిక్ కొడతారా.. మొదటిసారి అపజయాన్ని మూట కట్టుకుంటారా అనే విషయం ప్రస్తుతం ఇదే అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చనీ అంశంగా మారింది.


టిడిపి కంచుకోట ను వైసీపీ బద్దలు కొడుతుందా.. పెద్దిరెడ్డి ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఓటింగ్ జూన్ 4వ తేదీన జరగబోతోంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి తీర్పుఇచ్చారు.. ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు ప్రస్తుతం ఇది అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజవర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రాలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ హిందూపురం నియోజకవర్గం మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమనేదే లేదు.. ముఖ్యంగా ఇక్కడ నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడవసారి పోటీ చేయడం .

ఇప్పటికే ఎన్టీఆర్, హరికృష్ణ గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. బాలకృష్ణ రాజకీయ ఎంట్రీ కూడా హిందూపురం నుంచి చేశారు. గతంలో కేవలం టిడిపి గుర్తు కనిపిస్తే వేసేవారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా బాలయ్య ఈసారి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారు. ఇక్కడ వైసిపి పార్టీ నుంచి దీపికను బరిలోకి దింపారు. ముఖ్యంగా బాలకృష్ణకు లేపాక్షి చిలమత్తూరు వంటి ప్రాంతాలలో మంచిపట్టు ఉంది. ప్రస్తుతం హిందూపురం ప్రజలు ఎవరికి మగ్గు చూపారని విషయం అంతు పట్టడం లేదు.

అయితే గతంలో ఉండే నేతల కంటే బాలకృష్ణ అక్కడ మంచి పనులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య మైనస్లు విషయానికి వస్తే.. చుట్టపు చూపుగా ఎలక్షన్స్ ముందు వస్తూ ఉంటారు.. వైసీపీ నేత దీపిక విషయానికి వస్తే కురబ మహిళ.. ఈమె భర్త మాత్రం పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. గతంలో హిందూపురం వైసీపీలో చాలావరకు విభేదాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఎన్నికలలో నేతల మధ్య విభేదాలను కూడా సెట్ చేసి రంగంలోకి దింపారు. ముఖ్యంగా హిందూపురంలో మైనార్టీ ఓట్లు, రెడ్డి సామాజిక ఓట్లు  చాలా కీలకం.. టిడిపి కూటమితో జతకట్టడం వల్ల చాలా దెబ్బ పడినట్టుగా తెలుస్తోంది.
హిందూపురంలో రెండు లక్షల49, 174 మంది ఓటర్లు ఉంటే.. 1,93,96 మంది ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతంని ఒకసారి పరిశీలిస్తే..77.64% వరకు నమోదయింది.. కానీ ఈసారి బాలకృష్ణ గెలుపు అంత ఈజీగా లేదని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో నాలుగవ తేదీ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: