ఏపీ: మాచర్లలో బయటకొచ్చిన అసలు వీడియో.. భయంతో నేతలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఎక్కువగా పేరు వినిపిస్తోంది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు ఏపీలో విపరీతమైన చర్చనీయాంశంగా మారుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపైన కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీంతో అరెస్ట్ చేయాలంటూ కూడా పలు రకాల ఆదేశాలను కూడా జారీచేసింది. అయితే ఈ వీడియో పైన టిడిపి విమర్శలు చేస్తూ వైసీపీ పార్టీని ఎద్దేవా చేస్తోంది.

అయితే ఈ ఘటన పైన వైసిపి స్పందిస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా నిలిచింది.. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోని మాత్రమే కాకుండా అంతకు ముందు బూతులో ఏం జరిగింది అనే విషయాలను కూడా బయట పెట్టాలని ముఖ్యంగా రిగ్గింగ్ గురించి కూడా బయట పెట్టాలని అధికార పార్టీ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా మాచర్లకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియోలో కొంతమంది మహిళలు టిడిపి నాయకుల పైన ఆగ్రహాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆ మహిళలు వాపోతున్నారు.. ఒక సామాజిక వర్గానిదేనా అంటు మహిళల సైతం అక్కడ టిడిపి నేతలను ప్రశ్నిస్తున్నారు. కేవలం తమను ఓట్లు వేయకుండా టిడిపి నేతలు అడ్డుకుంటున్నారంటూ ఈ వీడియోలో తెలియజేస్తున్నారు. ఈ వీడియో పిన్నెల్లి వద్దకు వెళ్లగానే అక్కడికి చేరుకొని అక్కడ ఈవీఎంని ధ్వంసం చేశారన్నట్లుగా తెలుస్తోంది.. పోలింగ్ బూత్ లో టిడిపి నేతలు రిగ్గింగ్ పాల్పడ్డారని తెలిసిన తర్వాతనే ఇలా ఈవీఎంలను ధ్వంసం చేశారని కూడా వైసిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి అటు టిడిపి వైసిపి నేతలు ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇలా మహిళలు వీడియో బయటికి రావడంతో పలువురు నేతలు భయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: