జ‌గ‌న్ బ‌ల‌గం: ఊహించ‌ని విధంగా క‌లెక్టరైన లోతేటి శివ‌శంక‌ర్‌..!

RAMAKRISHNA S.S.
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
లోతేటి శివ‌శంక‌ర్‌. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పేరు మార్మోగింది. దీనికి కార‌ణం.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు. పైగా .. ఆయ‌న ప‌ని చేసింది పల్నాడు క‌లెక్ట‌ర్‌గా .. ! అయితే.. ఎన్నిక‌ల్లో హింస చెల‌రేగిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ను బ‌దిలీ చేసింది. ఇది త‌ప్ప‌.. ఆయ‌పై ఎలాంటి రిమార్కూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ప్ర‌ధానంగా చెప్పాల్సింది.. ఆయ‌న ఊహించని విధంగా క‌లెక్ట‌ర్ ప‌ద‌విని అందుకోవ‌డ‌మే. అప్ప‌టి వ‌రకు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అర‌కులో ప‌నిచేస్తున్న శివ‌శంక‌ర్ క‌లెక్ట‌ర్ అయ్యారు.

ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన శివ‌శంక‌ర్‌.. ఆద‌ర్వ అధికారిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. త‌న పిల్ల‌ల‌ను ప్ర‌భు త్వ స్కూళ్ల‌లోనే చ‌దివించారు. అంతేకాదు.. త‌న‌కు అనారోగ్యం చేస్తే.. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేరి.. ప్ర‌భుత్వంలో ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. సీఎం జ‌గ‌న్ అంటే.. అమితంగా ఇష్ట‌ప‌డే శివ‌శంక‌ర్‌.. ప్ర‌భ‌త్వ ప‌థ‌కాల కు ఎన‌లేని ప్రాదాన్యం ఇచ్చారు. ఉపాధి క‌ల్పనా రంగంలో విశేషంగా కృషి చేశారు. త‌న జిల్లా ప‌రిధిలో త‌ర‌చుగా పారిశ్రామి క స‌ద‌స్సులు నిర్వ‌హించి.. యువ‌త‌కు ఉద్య‌గాలు క‌ల్పించారు.

అదేవిధంగా త‌న ప‌రిదిలో నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వేల మంది యువ‌త‌కు శిక్ష‌ణ ఇప్పించారు. ఇక‌, ఈ జిల్లాలోని వ‌రిక‌పూడి సెల ప్రాజెక్టు పై ప్ర‌త్యేక అధ్య‌య‌నం చేసి.. త్వ‌రిత గ‌తిన పూర్తిచేసేలా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల‌తో అవినాభావ సంబంధాలు పెంచుకోవంలోనూ.. అవినీతి ర‌హిత పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలోనూ శివ‌శంక‌ర్ స్ట‌యిలే వేరుగా ఉంటుంద‌ని అంటారు.

ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉన్నా.. తాను స్వ‌యంగా జోక్యం చేసుకుని ముందుండే వారు. ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విష‌యం కూడా ఉంది. జిల్లాకు చెందిన ఉన్న‌త విద్య చ‌దివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఆయ‌నే టీచర్‌గా మారి వారాంతాల్లోక్లాసులు తీసుకునేవారు. ఫ‌లితంగా ఇక్క‌డ విద్యార్థుల‌కు పోటీ ప‌రీక్ష‌లంటే భ‌యం పోయేలా వ్య‌వ‌హ‌రించారు. ఇలా.. త‌న‌దైన శైలిలో త‌న స‌త్తా నిరూపించుకున్నారు శివ‌శంక‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: