జగన్: రెండవ ప్రమాణ స్వీకారానికి.. పనులు జరుగుతున్నాయా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా అటు వైసిపి టిడిపి పార్టీ మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి.. అంతేకాకుండా ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓటింగ్ కూడా మరింత ఎక్కువగా జరగడంతో పాటు యుద్ధ వాతావరణాన్ని కూడా తలపించింది. ఇప్పటివరకు సర్వేలన్నీ కూడా వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. అటు కూటమి కూడా కొన్ని సర్వేలు చెబుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం కూటమి బాగా కలిసి వచ్చిందని అందుకే ఈసారి తాము అధికారంలోకి రాబోతున్నామని ఎంతగా తెలియజేస్తున్నారు. ఇలా ఎవరు లెక్కలు వారికి ఉన్నాయి.

అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈసారి ప్రమాణస్వీకారం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో చేస్తారని వైసీపీ నేతలు తెలియజేశారు.. ఆ తర్వాత టిడిపి నేతలు అమరావతిలో తమ నేత ప్రమాణ స్వీకారం చేస్తారంటూ తెలియజేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా అటు టిడిపి, వైసిపి మధ్య హోరాహోరిగానే జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వినిపిస్తున్న విషయం ఏమిటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణస్వీకారం చేయడానికి వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో సిద్ధం చేస్తున్నారని.. అందుకు తగ్గట్టుగా అధికారులు అక్కడ సెక్రటేరియర్లు కూడా పర్యవేక్షణలోనే ఈ పని జరుగుతోందని మరొకవైపు పార్టీ నేతలు గెస్ట్ , హోటల్స్ రూమ్లను బుక్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఇప్పుడు టిడిపి పార్టీ ఏం చేస్తుందనే విషయం పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అసలు ఫలితం అనేది జూన్ 4వ తేదీన వెలుబడుతుంది. ఇప్పటి వరకు జగన్ తమకు వచ్చే సీట్ల పైన మాట్లాడినప్పటికీ చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు ఏ విధంగా మాట్లాడలేదు. కేవలం విదేశాలకు విశ్రాంతి కోసం ఇరువురి నేతలు కూడా వెళ్లడం జరిగింది. మరి జూన్ 4వ తేదీ ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: