హీరోయిన్ గా మారనున్న సితార.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ..!

lakhmi saranya
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సితార పాప ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటినుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఘట్టమనేని వారసురాలు.. చిల్డ్రన్ వీడియోస్ తో భారీ మొత్తంలో సబ్స్క్రైబ్నుర్స్‌ దక్కించుకుంది. ఇక డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఇక తండ్రిని మించిన కూతురు అవుతుందనే ప్రశంసలను కూడా దక్కించుకుంది. తండ్రిని ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది.

తండ్రిని కూడా ఇంటర్వ్యూ చేసి సితార..అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేసింది. అటు మహేష్ బాబు కూడా పుత్రిక ఎదుగుదలకు బాగా సహాయపడుతున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అన్నను ఆట పట్టించడం అంటే ఇష్టం అంటూ వెల్లడించింది. ఇక అనంతరం అన్న నుంచి ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చని తెలిపింది. తండ్రి నుంచి యాక్టింగ్ తల్లి నుంచి ఫ్యాషన్ సన్స్ నేర్చుకుంటానని చెప్పింది. ఇక మహేష్ బాబు ఖలేజా సినిమాలోని సీత రామ రాజు పాత్ర చేయాలని ఉందని తెలిపిన సితార ఫ్లూయెన్సర్స్ కు మంచి టిప్స్ అందించింది.

ఇక లేటెస్ట్ గా వైరల్ అయినా మహేష్ - మంజుల క్యూట్ మూమెంట్ గురించి కూడా సరదాగా చెప్పుకొచ్చింది. నాన్నకు తన హెయిర్ అంటే ఇష్టమని అందుకే అత్త టచ్ చేయగానే వద్దని చెప్పాడని తెలిపింది. కాగా ఈ క్యూట్ పాపకు హీరోయిన్ కావాలని కోరిక ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా తెలియజేసింది. ప్రజెంట్ సితార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన పలువురు సితార త్వరగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే సితార నటించబోయే సినిమాలో మహేష్ కూడా ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తే ఆ చిత్రం అదుర్స్ అంటూ సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: