మాచర్లకు పిన్నెల్లి బ్రదర్స్‌.. ప్రజలలో టెన్షన్ టెన్షన్..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తేదీన తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ టిడిపి నేతలు ఇరు పార్టీల పోలింగ్ ఏజెంట్ల పై దాడులకు పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని నెపంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారని చెబుతూ ఈవీఎంలను బద్దలు కొట్టారు. వారిలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. పోలింగ్ సమయంలో ఆయన మాచర్లలోని ఈవీఎం ధ్వంసం చేశారు. ఆయన ఈవీఎంను నేలకేసి బాదిన వీడియో ఫుటేజ్ కూడా లభించింది.
దాని ఆధారంగా పిన్నెల్లిపై ఇప్పటికే 3 చట్టాల ప్రకారం 10 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పిన్నెల్లి హైకోర్టు మెట్లు ఎక్కారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు తాజాగా దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు వెలువరించడం విశేషం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూన్ 5 ఉదయం 10 గంటల వరకు చర్యలు తీసుకోవడానికి వీల్లేదని పోలీసులు, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంతోషించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన మాచర్లకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు వస్తే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో అని ప్రజలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
రామకృష్ణారెడ్డి తన తమ్ముడు వెంకట్రామిరెడ్డితో కలిసి మాచర్లకు రానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి రాకతో ఏదైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని చాలామంది భయపడుతున్నారు. అనుచరులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇదిలా ఉండగా మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కువమంది బయట గుమి గూడకుండా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు.పరిస్థితులు ఇంకా కంట్రోల్లోకి రాకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లను సందర్శిస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: