గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత.!

Divya
వైఎస్ఆర్సిపి పార్టీలో కీలకమైన నేతలలో ఒకరుగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఒకరిని చెప్పవచ్చు. జగన్ మీద తమ పార్టీ మీద తమ మీద ఎవరినైనా సరే ఏమైనా అంటేనే వెంటనే స్పందించే గుణం కలిగిన వ్యక్తి కొడాలి నాని. అయితే తాజాగా కొడాలి నాని అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. ఈరోజున తన స్వగృహంలో నందివాడ మండలం వైసిపి నాయకులతో మాట్లాడుతూ ఉండగా సోపలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా సమాచారం. వెంటనే అక్కడ నేతలు అప్రమత్తం అవ్వడంతో హుటాహుటిక వైద్యులకు సమాచారం అందించారు.

ప్రథమ చికిత్స అనంతరం కొడాలి నాని కి వైద్యులు సెలైన్ బాటిల్ ఎక్కించినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల  ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయని వైద్యులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలిసిన గుడివాడ నాని కుటుంబ సభ్యులు హుటా హుటిగా హైదరాబాదు నుంచి బయలుదేరారు. అయితే కొడాలి నాని కి అనారోగ్య భారీన గురి కావడంతో వెంటనే అభిమానులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. అసలు తమ నేతకు ఏం జరిగిందని విషయం పైన వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు

అయితే గత కొన్ని నెలల నుంచి కొడాలి నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా హైదరాబాదులో పలు రకాల చికిత్సలు కూడా చేయించుకున్నప్పటికీ కొడాలి నాని కి ఆరోగ్యం సెట్ కాలేదని సమాచారం. మరి కొడాలి నాని ఆరోగ్యం పైన కుటుంబ సభ్యులు లేదా ఆయనే డైరెక్ట్ గా స్పందిస్తుందేమో చూడాలి మరి. గత కొన్ని నెలలుగా ఎలక్షన్ సమయం కావడం చేత ఎక్కువగా తిరగడం ఆలోచించడం వంటివి చేయడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్య వచ్చిందని సమాచారం. ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ముందుకు వెళుతున్నారు నాని. మరి ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: