బొండా ఉమా: విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా రెండోసారి..?

RAMAKRISHNA S.S.
ఆయ‌న నోరు విప్పితే.. ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకే. ఆయ‌న విమ‌ర్శ‌లు సంధిస్తే.. ఇక‌, నోరు కూడా పెగ‌ల‌ని ప‌రిస్థితి. ప‌క్కా ఆధారాలు.. ప‌క్కా లెక్క‌ల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీపై విరుచుకుప‌డ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్న టీడీపీ పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ప్ర‌స్తుతం ఈయ‌న మాజీ ఎమ్మెల్యేనే కావొచ్చు.. కానీ, ఆయ‌న‌కు దూర దృష్టి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఉన్న అవ‌గాహ‌న మాత్రం న‌భూతో అని అన‌కుండా ఉండ‌లేరు.

అంతేకాదు.. బొండా ఉమా గురించి.. తెలిసిన వారు, ఆయ‌న ఫైర్‌బ్రాండే కాదు.. క‌లివిడి త‌నం.. క‌ష్టాల‌పై ఉదార‌త కూడా ఉన్న నాయ‌కుడిగా సొంత పార్టీ నాయ‌కులు చెబుతారు. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌. అంద‌రినీ క‌లుపుగోలుగా మాట్లాడ‌డ‌మే కాదు.. ఎవ‌రు వ‌చ్చి ఎలాంటి సాయం అడిగినా.. లేద‌నే స్వ‌భావం ఆయ‌న డిక్ష‌న‌రీలోనే లేద‌ని చెబుతారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  2014లో విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం కేవ‌లం 25 ఓట్ల తేడాతో గెలుపు గుర్రానికి దూర‌మ‌య్యారు.

వాస్త‌వానికి వైసీపీ హ‌వా.. జ‌గ‌న్ దూకుడు ఓ రేంజ్‌లో ఉన్న ఆ ఎన్నిక‌ల్లోనే కేవలం 25 ఓట్ల తేడాతో గెలుపు న‌కు దూరంగా ఉండడం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. ఆయ‌న గెలుపు కాదు.. మెజారిటీపైనే అంచనాలు ఉన్నాయ‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం క్లాస్ కన్నా మాస్ ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. పైగా.. ఇక్క‌డివారికి నేనున్నానంటూ. బొండా ఉమా అనేక సంద‌ర్భాల‌లో సేవ‌లు అందించ‌డ‌మే కాకుండా.. ఆర్థికంగా కూడా సాయం చేశారు.

ప్ర‌తిపక్షంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ముందున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు.. విస్తృతంగా క‌మ్యూనిటీ హాళ్లు నిర్మించారు. అదేవిధంగా వివిధ సామాజిక వ‌ర్గాల ఆకాంక్ష మేర‌కు క‌ళ్యాణ మండ‌పాల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మ‌రుగు దొడ్ల నిర్మాణం, ర‌హ‌దారుల నిర్మాణం.. ఇలా.. అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేసిన సేవ‌లు ఇప్ప‌టికీ చ‌ర్చ‌గానే ఉన్నాయి. ఎన్నిక‌ల్లో ఇవే ఆయ‌న‌కు ప్ల‌స్‌గా మారి మ‌రోసారి సెంట్ర‌ల్ ఎమ్మెల్యేను చేయ‌బోతున్నాయ‌న్న చ‌ర్చ‌లు అయితే న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: