మొన్నే అధికారంలోకి వచ్చి.. రూ.950 కోట్ల స్కామ్ చేసారా.. వెలుగులోకి షాకింగ్ విషయం?

praveen
ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా స్కాంలకు పాల్పడిన వారిని అటు ఈడి అధికారులు అరెస్టు చేసి విచారించడం కూడా చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి కుంభకోణాలు కూడా జరిగాయి అంటూ ఇప్పుడు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆర్ టాక్స్ కూడా వసూలు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.

 ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.  ఇక ఇప్పుడు ఆయన మరో బిగ్ బాంబు పేల్చారు  ఆర్ టాక్స్ కు జతగా మరో టాక్స్ ని వసూలు చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు  యు టాక్స్ పేరిట 950 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు  యు టాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 500 కోట్లు కేసి వేణుగోపాల్కు ఇచ్చారని ఇది వాస్తవం కాదా అంటూ సూటి ప్రశ్న వేశారు. సహచర మంత్రులు ఎమ్మెల్యేలు తనకన్నా ముందుకు వెళ్తున్నారని తను వెనుకబడి పోతున్నాను అనే భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు మహేందర్ రెడ్డి.


రైస్ మిల్లర్లతో ఉత్తంకుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని 450 కోట్లు ఈయనకు చెల్లింపులు జరిగాయి అంటూ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక త్వరలోనే మిగతా శాఖల బండారం కూడా బయట పెడతాను అంటూ స్పష్టం చేశారు. అయితే మహేశ్వర్ రెడ్డి కామెంట్ల పై స్పందించిన ఉత్తంకుమార్ రెడ్డి పాపులారిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని యు టాక్స్ అనేది పచ్చి అబద్ధం అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: