మచిలీపట్నం: కొల్లు రవీంద్రకే కలిసి రానుందా..?

Pandrala Sravanthi
• బందర్ 'బాద్ షా' ఎవరు..?
• జనసేనతో పొత్తే
రవీంద్రను గెలిపిస్తుందా..?
 • కాపు ఓట్లు ఎవరి వైపో..?


 ఏపీలో అత్యంత కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గం కూడా ఒకటి. ఏ ఎలక్షన్స్ లో అయినా ఈ సీటు చాలా హాట్ టాపిక్ గా మారుతుంది.  అలాంటి మచిలీపట్నం నుంచి ఈసారి ఇద్దరు హేమాహేమీలు పోటీ చేస్తున్నారు.  ఇందులో టిడిపి నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో ఉండగా, వైసీపీ నుంచి  ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పేర్ని  నాని కొడుకు  కిట్టు పోటీ చేస్తున్నారు. మరి అలాంటి ఈ కీలక నియోజకవర్గంలో  ఎవరు గెలుస్తారు. ఎవరు బందరుకు బాద్ షా అవుతారు అనే వివరాలు చూద్దాం.
 మచిలీపట్నం నియోజకవర్గం అంటేనే చాలా హాట్ గా ఉంటుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ వైపు డిసైడ్ అయితే ఆ వైపు విజయం పక్కా వరిస్తుంది. అలాగే ఇక్కడ బందరు పోర్టు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మూడు తరాల వారు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్తింపు ఉంది.. ఈసారి నాలుగవ తరం  పేర్ని కిట్టు బరిలోకి వచ్చారు. అలాంటి ఈ కీలక నియోజకవర్గంలో 35% కాపు ఓట్లు ఉన్నాయి.  ఇదే తరుణంలో టిడిపి, జనసేనలో భాగంగా పోటీ చేసే అభ్యర్థికే ఈ కాపు ఓట్లు ఎక్కువగా పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇందులో వైసీపీ నుంచి పోటీ చేసేది కాపు నేత కావడంతో ఓట్లు రెండువైపులా చీలే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
 గెలుపోటములు:
2019 ఎలక్షన్స్ టైంలో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో వైసిపికి 44%, తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు, పడ్డాయి. జనసేనకు 13 శాతం, ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చాయి. అక్కడ వైసిపి 2019లో విజయం సాధించింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మచిలీపట్నాన్ని అంతగా అభివృద్ధి చేయలేదనే అపోహ వల్ల 2019 ఎలక్షన్స్ లో పేర్ని నాని విజయం సాధించారు. అలాంటి ఈ తరుణంలో ఐదు సంవత్సరాలు పాలించిన వైసిపి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీంతో చాలామంది ప్రజలు కొల్లు రవీంద్ర వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. పోయిన ఎలక్షన్స్ లో పేర్ని నానిపై కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లతోనే ఓడిపోయారు. ఈ సమయంలో జనసేనకు దాదాపు 19 వేల ఓట్లు పడ్డాయి. ఈసారి జనసేన, బిజెపి ఓట్లు టిడిపికి అభ్యర్థికి కనీసం సగం పడిన తప్పక రవీంద్ర విజయం సాధిస్తారు.
 పేర్ని కిట్టు
 బలాలు:

 కరోనా టైంలో చేసిన సేవలు.

అందరితో కలిసి పోవడం.


సొంత క్యాడర్ ను బలోపేతం చేయడం.


 బందరు పోర్టు ప్రారంభం.
బలహీనతలు :
 కొల్లు రవీంద్ర బలమైన ప్రత్యర్థి కావడం.


  అనుభవం తక్కువగా ఉండడం.
 మచిలీపట్నంలో రోడ్లు ఇతర అభివృద్ధి పనులు ఏమీ జరగకపోవడం.
వైసిపి నాయకుల ఆగడాలు పెరిగిపోవడం.
 జనసేన ఓట్లు టిడిపికి కలిసి రావడం.
 కెమికల్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు   డ్రైనేజీలో కలవడం వల్ల జనాలకు అనారోగ్యం.
 తాగునీటి కష్టాలు.
 కొల్లు రవీంద్ర:
బలాలు:

సీనియర్ నేతగా గుర్తింపు.
 యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం.
 టిడిపిలో అసమ్మతి నాయకులు లేకపోవడం.
 పేర్ని నాని పోటీకి దూరంగా ఉండడం.
 అలాగే జనసేన, టిడిపి, బిజెపి కలవడం.
 బలహీనతలు:
 2014లో మంత్రిగా ఉండి అభివృద్ధి చేయకపోవడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: