మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్ డార్లింగ్.. రెబల్ ఫ్యాన్స్ కడుపు మంట పెరిగిపోయిందే..!
కాగా ఈ సినిమా విడుదల డేట్ ను కూడా ప్రకటించేశారు. ఏప్రిల్ 10న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది అంటూ మూవీ టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది. సినిమా షూట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది . ఇంకా కూడా కొన్ని కొన్ని సీన్స్ రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట. అంతేకాదు ప్రభాస్ డేట్ లు దొరికినప్పుడు మాత్రమే మారుతి ఈ సినిమా షూటింద్ ని చేస్తున్నారట. మిగతా టైం లో అంతా కూడా మిగతా నటీనటులతో తెరకెక్కించే సీన్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట .
అయితే ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు . ఆయన ఒక్క రోజు కూడా కాల్ షీట్ ఇచ్చేందుకు రెడీగా లేరు. మరి అలాంటిది రెండు పాటలు కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయి అంటే చాలా చాలా కష్టమని అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మారుతి సినిమా రిలీజ్ డేట్ విషయంలో వెనకడుగు కూడా వేస్తున్నాడు అన్న టాక్ వినిపించింది . ఏప్రిల్ 10 కాకుండా జులైలో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలు కూడా చేస్తున్నారట మారుతి. ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే కాల్ షీట్స్ డిమాండ్ చేయకుండా ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటున్నారట . దీంతో ప్రభాస్ మళ్ళీ అభిమానులకి హ్యాండ్ ఇచ్చినట్లైంది. అసలే ఆయన పెళ్లి వార్త ను బాగా ట్రెండ్ చేశారు . ఇప్పటివరకు ప్రభాస్ దాని ఊద్సే ఎత్తలేదు. అయితే త్వరలోనే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రాజాసాబ్" సినిమాతోనైనా అభిమానుల కోరిక నెరవేరుస్తారు అనుకున్నారు . కానీ ఇప్పుడు అది కూడా ఆలస్యం అయిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!