తెలంగాణ: బీఆర్ఎస్ కారు స్టీరింగ్ "చేతి"లోకి రానుందా.. తెరవెనక జరిగేదేంటి.?

Pandrala Sravanthi
కేసీఆర్  పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకదాటిగా పాలించినటువంటి నేత. ఆయన పాలనలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, అంత అప్పుల్లో కూరుకు పోయిందని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనతో ఎన్నికల బరిలో నిలిచాడు. కానీ అనూహ్యంగా  కాంగ్రెస్ చేతిలో దెబ్బతిన్నాడు. అప్పటినుంచి కేసీఆర్ కు  దెబ్బ మీద దెబ్బ పడుతోంది.  ఇప్పటికే చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్, బిజెపి వైపు వెళ్తున్నారు.ఈ తరుణంలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత  చేతి గుర్తులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే అంటున్నారు.  

ఒక్కసారి గేట్లు తెలిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కారు స్టీరింగ్ చేతిలోకి వస్తుందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి  మినహా ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ కీలక నేతలు  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకో బోతున్నారని తెలుస్తోంది. వీరంతా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి చేరానున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తం అక్కడ 12 నియోజకవర్గాల్లో 11 కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఎంపీ ఎలక్షన్స్ లో కూడా భువనగిరి, నల్గొండ భారీ మెజారిటీతో గెలుస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.

 ఈ క్రమంలోనే  ఉమ్మడి నల్గొండలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా  ఖాళీ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఓడిపోయిన లీడర్లంతా ముకుమ్మడిగా  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా ఒక కీలక నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. దీనిపై ఆ నేత పార్టీ హైకమాండ్ తో కూడా చర్చలు జరుపుతున్నారట.  ఇదే తరుణంలో జూన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, బీఆర్ఎస్ ను మరింత వీక్ చేసి కాంగ్రెస్ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.  అక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మినహా, మిగతా వారంతా కాంగ్రెస్ లోకి వస్తారని  నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: