మోడీ: ఉచిత బస్సు ప్రయాణం పై.. చంద్రబాబుకు షాక్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు సైతం మూకుమ్మడిగా వైసిపి పార్టీ పైన పోటీకి దిగాయి.. ఇప్పటికే పలు రాష్ట్రాలలోనీ ప్రభుత్వాలు కూడా మహిళలకు వరాలను కురిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వంటిది కూడా ఒకటి.. ఇది పార్టీలకు బాగా కలిసి వస్తున్నప్పటికీ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి ప్రాంతాలలో ఈ పథకం బాగా కొనసాగుతోంది. కానీ ఇక్కడే ఒక సమస్యగా ఏర్పడింది. దీనివల్ల చాలామంది ఆటో , టాక్సీ ఇతరత్రా వాటి మీద జీవనం సాగించే వారికి పెద్ద దెబ్బ పడేలా కనిపిస్తోంది.

అంతేకాకుండా బస్సు ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల కూడా ఆర్టీసీ నష్టాలలో మునిగేలా కనిపిస్తోందట. అయితే తాజాగా ఈ స్కీమ్ పైన ప్రధాన నరేంద్ర మోడీ పలు రకాల కామెంట్స్ చేశారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మెట్రో చాలా ఇబ్బందులలో పడుతోందనే విధంగా మాట్లాడారు మోది.. దీనివల్ల 50 శాతం వరకు మహిళలు మెట్రో కోల్పోతుందని కూడా వెల్లడించారు. దీనివల్ల మెట్రో నిర్వహణ కూడా చాలా కఠినంగా మారుతుందనే విధంగా మోడీ మాట్లాడారు.

రాబోయే రోజుల్లో కచ్చితంగా మెట్రో నిర్మాణం జరగకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం అడ్డుపడుతుందని కూడా తెలియజేశారు.. అయితే ఇలాంటివన్నీ ఎవరు ఆలోచించారు కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఇలాంటి హామీలు ఇస్తున్నారనే విధంగా ఇప్పటికే పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. అలాగే మెట్రో ప్రాంతాలలో కూడా ఖాళీగానే మెట్రోలు నడుస్తున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా అటు టిడిపి ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మోదీ మద్దతు లేనట్టుగా కనిపిస్తోంది. కచ్చితంగా ఇలాంటి వాటికి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సహకరించదని వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయం టిడిపి పార్టీకి కూడా షాక్ అనేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: