చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు ప్రేమ‌తో ... ఆ ఓట్ల‌న్నీ కూట‌మికి కుమ్మేశారు...!

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యువత పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో క‌నిపించారు. ఓటేశారు. అయితే.. వీరు ఎటువైపు సానుకూలం అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో జ‌రిగిన పోలింగ్‌లో యువ‌త ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. వీరిలో 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు కొత్త ఓట‌ర్లు ఉన్నారు. అంటే.. ఈ ఎన్నిక‌ల్లోనే వారికి తొలిసారి ఓటు హ‌క్కు ల‌భించింది. దీంతో వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు ? అనేది కీల‌కం.

మెజారిటీగా చూసుకుంటే యువ‌త ఓటు బ్యాంకు ఎక్కువ‌గా విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, కాకినాడ‌, కర్నూలు, గుంటూరు న‌గ‌రాల్లో ఉంది. ఇక్క‌డ చ‌దువుకున్న వారే ఎక్కువ‌గా ఓటేసేందుకు ముందుకు వ‌చ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే యువ‌తులు ఎక్కువ‌గా క‌నిపించారు. వీరిలో ఎక్కువ మంది మొగ్గు అభివృద్ధి, ఐటీ కంపెనీల వైపు క‌నిపించింది. అదేవిధంగా కొత్త‌గా ఉద్యోగాలు.. ప్ర‌భుత్వ ప‌రంగా ఉపాధి వంటి అంశాలు వీరిని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేశాయ‌నేది వాస్త‌వం.

ఈ ర‌కంగా చూసుకుంటే.. కొత్త‌గా ఓటు హ‌క్కు పొందిన వారిలో ఉద్యోగ‌, ఉపాధి రంగాలు, ప‌రిశ్ర‌మ‌లు, అభివృద్దివైపు మొగ్గు చూపించారు. ఇదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు పార్టీల‌పై కంటే. పార్టీ ల‌నాయ‌కుల‌పై అభిమానంతో పోటెత్తారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అభిమానంతో మెజారిటీ యువ‌త పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లి వ‌చ్చింది. ఇక‌, ఉద్యోగ‌, ఉపాధి వంటివి కోరుకున్న‌వారు.. టీడీపీ వైపు.. ముఖ్యంగా చంద్ర‌బాబు వైపు మొగ్గు చూపించారన‌డంలో సందేహం లేదు. యూత్ లో మెజార్టీ త‌మకు ఉద్యోగం , ఉపాధి లేద‌న్న ఆవేద‌న తో ఉన్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది.

అదేవిధంగా .. అమ‌రావ‌తిరాజ‌ధానిని కోరుకున్న యువత కూడా వీరిలో ఉన్నారు. అలాగ‌ని పూర్తిగా టీడీపీకి, జ‌న‌సేన‌కు గుడ్డిగా ఓట్లేశార‌ని కూడా చెప్ప‌లేం. ఉదాహ‌ర‌ణ‌కు వంద మంది యువ‌త తొలిసారి ఓటేస్తే.. వీరిలో 20 శాతం మంది జ‌గ‌న్‌పై ఉన్న అభిమానంతో ఫ్యాన్‌కు ఓటేశార‌నేది అంచ‌నా ఉంది. మిగిలిన వారిలో ఎక్కువగా టీడీపీ.. మిగిలిన వారు జ‌న‌సేన వైపు మొగ్గు చూపించారు. అయితే.. ఎలా చూసుకున్నా..యువ‌త ఓట్లు మాత్రం కూట‌మికి అనుకూలంగానే ప‌డిన‌ట్టు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: