తెలంగాణ పల్స్.. 15 స్థానాలలో పరిస్థితి ఇది?

praveen
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది తేలిపోనుంది. ఈ క్రమంలోనే ఈ 17 పార్లమెంటు స్థానాలు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే 15 పార్లమెంట్ స్థానాలలో అటు బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది అన్నది తెలుస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక రాజ్యాంగం, రిజర్వేషన్లు, దేశ భద్రత, హిందుత్వవాదం తదితర జాతీయ అంశాలు ఎజెండాగా కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రచార నిర్వహించాయి. దీంతో లోకల్ పార్టీ అయినా బిఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. మూడో స్థానానికి పరిమితమైందని.. పోలింగ్ సరళి ద్వారా అందరికీ అర్థమవుతుంది.

 ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్ లాంటి నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ లీడర్లు తెరవెనుక ఏకంగా కమలం పార్టీకి సపోర్ట్ చేసారు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇక 17 ఎంపీ స్థానాలకు గాను 15 సీట్లలో కాంగ్రెస్, బిజెపి మధ్య ప్రధాన పోరు నడిచింది. ఒక మెదక్లో మాత్రమే కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బిఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగలిగింది అనే టాక్ ఉంది  ఇంకోవైపు ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం బిజెపి పార్టీల హోరాహోరీ పోరు నడిచింది. అయితే తెలంగాణలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి అధిష్టానం. మోదీ అమిత్ షా లాంటి నేతలు ఇక అభ్యర్థుల తరపున  ప్రచారం చేసి ప్రసంగాలు ఇవ్వడం.. దేశభద్రత, ఉగ్రదాడులు, రామాలయం, హిందుత్వం లాంటి అంశాలను పదేపదే ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 కాంగ్రెస్ ను గెలిపిస్తే హిందువుల ఆస్తులను లాక్కొని ముస్లింల చేతిలో పెడుతుంది అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిపోయాయి. అయితే రిజర్వేషన్లను ఎత్తివేయడానికి ఇక బిజెపి కేంద్రంలో 400 సీట్లలో గెలిపించమని అడుగుతున్నారంటూ సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం వచ్చిన రాహుల్,ప్రియాంక, ఖర్గే లాంటి జాతీయ నేతలకు కూడా ఇదే అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. ఇలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ గానే మారిపోయింది పోటీ. ఐదు నెలల క్రితం అసెంబ్లీలో ఓటమిపాలైన బిఆర్ఎస్కు కీలక నేతలు పార్టీని విడటంతో ఇక తగినంతగా అటు ఎన్నికలకు సిద్ధం కాలేదు. తమ పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా పార్లమెంటుకు పంపిస్తే ఏం చేస్తాం అనే విషయంపై స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోయింది. ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయలేకపోయింది. దీంతో ఇక ప్రధాన పోటీలో మాత్రం నిలవలేకపోయింది. ఇలా 15 పార్లమెంట్ స్థానాలలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉండగా ఎవరు గెలుస్తారు అన్నది జూన్ నాలుగో తేదీన తేలబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: