ఏపీ ( కూటమి): గత్యంతరం లేక పొత్తు.. బాబు లబోదిబో..!
నిజానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి లను వెంటనే మార్చేయాలని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న వెంటనే వీరిద్దరిని మార్చేయాలని బిజెపిని కోరింది టిడిపి.. కానీ అక్కడే టిడిపికి చుక్కెదురయింది.. ఎన్నికలకు కేవలం వారం ముందు మాత్రమే పోలీస్ బాస్ డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మారిపోయారు.. కొత్తగా వచ్చిన డీజీపీ హరీష్ గుప్తా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారి అని టిడిపి నేతలు అంటున్నారు.. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ లు, 5 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసినా.. కొత్తగా వచ్చిన వారు కూడా అటు వైసీపీకే అనుకూలంగా ఉండడంతో టిడిపి నేతల్లో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి..ఒకరకంగా చెప్పాలంటే బిజెపితో పొత్తు వల్ల కలిగే రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది..
ముఖ్యంగా బీజేపీతో పొత్తు కలపడం వల్ల అప్పటివరకు అనుకూలంగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీలు కూడా ఇప్పుడు దూరమైపోయారు.. అలాగే దళితుల ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో పడవనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక లాభం కోసం కూటమితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుకూలం లేకపోయేసరికి లబోదిబో అంటున్నారు..