జగన్: వచ్చాకే విద్యాసంస్థలలో మార్పు వచ్చిందా..?
వైద్యానికి సంబంధించి తాజాగా నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒప్పుకుంటూ .. నిజంగా ఇది జరిగిందా అనే విషయం ప్రజలలో ప్రశ్నగా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు గారి టైంలో రూ.20 లక్షల వరకు నారాయణ విద్యాసంస్థలలో ఫీజు ఉండేదట.. దానిని మార్చారు జగన్ వచ్చి అంటూ తెలుపుతున్నారు. పీజీ క్యాటగిరి ఫీజు చంద్రబాబు రాకముందు సంవత్సరానికి రూ .5లక్షల రూపాయలు ఉండేదట. చంద్రబాబు వచ్చాక 25 లక్షల రూపాయలు అయ్యిందట.
బి కేటగిరి ఎంబీబీఎస్ కి.. 2,40,000 నుంచి.. మొదట పది లక్షలు.. ఆ తర్వాత 11 లక్షల 50 వేల వరకు పెంచారట. ఇది నిజం అని చెప్పి పలువురు విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు.. అలాగే జగన్ వల్ల బి క్యాటగిరి ,A కేటగిరి సీట్లు కాస్ట్ తగ్గించేశారని.. ఫీజులు విషయంలో ఎవరికి వారు నిజాలు చెప్పేస్తే ఉన్నారు దీన్ని బట్టి చూస్తే జగన్ వచ్చిన తర్వాత ఈ మార్పులు కనిపిస్తున్నాయని కూడా విద్యార్థులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాలలో ఉండే స్కూల్లు కాలేజీలు సైతం సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయని చాలామంది ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన భోజనం దుస్తులు పుస్తకాలు వంటివి కూడా ఇస్తున్నారు. మరి ఇదంతా కేవలం జగన్ వల్లే సాధ్యమైందని కూడా చెప్పవచ్చు.