ఏపీ: పొలిటికల్ హీట్ పెంచేస్తున్న తాజా సర్వే.. రెండు పార్టీలకు టెన్షన్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలలో భాగంగా ఈసారి వైసిపి పార్టీని ఎదుర్కోవడానికి టిడిపి, జనసేన బిజెపి మూడు పార్టీలు ఏకమయ్యాయి.. కానీ వైసీపీ పార్టీ మాత్రం కచ్చితంగా ఈసారి తమదే విజయం అన్నట్టుగా ధీమాని తెలియజేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు రకాల సర్వేలు కూడా అటు కూటమికి వైసీపీ పార్టీకి మద్దతుగానే వస్తూ ఉన్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా ఒక సర్వే సంస్థ చిన్న దండు సర్వే చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఒక లిస్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జిల్లాల వారీగా రిలీజ్ చేశారు.

అయితే వీళ్ళు తెలిపిన ప్రకారం ఏమిటంటే.. కూటమికి లో భాగంగా 73 నియోజవర్గాలు పాజిటివ్ గా ఉన్నాయి.. వైసీపీకి 55 నియోజకవర్గాలలో పాజిటివ్గా ఉన్నది.. కానీ హోరాహోరీ గా మాత్రం 47 నియోజకవర్గాలలో ఉండబోతోందనే విధంగా ఈ సర్వే తెలియజేస్తోంది. నిన్నటి రోజుకి ఈ సర్వే వచ్చిన లెక్క అంటూ తెలియజేశారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయం తెలియదు కానీ.. జిల్లాల వారీగా వీరు లిస్టును విడుదల చేశారు. వాస్తవానికి ఈ సర్వే నిజమవ్వచు కాకపోవచ్చు కానీ.. ఇప్పటికి ఎన్నో సర్వేలు కూడా  ఈ విధంగా తెలియజేస్తూ ఉండడం వల్ల అభ్యర్థులకు ఇలాంటి సర్వేలు కాస్త భయాలను కలిగిస్తాయని చెప్పవచ్చు.

వాస్తవానికి నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో అయిపోతుంది. కనుక ఈ రోజు నుంచి అసలైన ప్రచారం జరుగుతుంది.. అభ్యర్థులు ఎవరైనా సరే చివరి 15 రోజులు మాత్రమే తమ స్టామినా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో చేస్తేనే ఖచ్చితమైన సర్వే వస్తుందని కూడా పలువురు  నేతలు తెలియజేస్తున్నారు.. పొలిటికల్ రాజకీయం కూడా ఈ 15 రోజులలోనే అభ్యర్థులను డిసైడ్ చేస్తాయని కూడా తెలుపుతున్నారు. వాస్తవానికి ఈ 15 రోజులు వచ్చే రిజల్ట్ అసలైన రిజల్ట్ అని చెప్పవచ్చు.. నామినేషన్స్ పూర్తీ అయ్యాయి కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా తమ నియోజకవర్గాలలోనే  ప్రజలలోనే మమేకమయ్యాల చూస్తూ ఉంటారు. వీటికి తోడు మేనిఫెస్టోలు కూడా విడుదల చేస్తే కచ్చితంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది.. కానీ ఇలాంటివి కాకముందే పలు రకాల సర్వేలు కూడా ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అటు వైసిపి పార్టీ టిడిపి పార్టీ తమ వస్త్రాలను తీస్తూ గెలవాలని సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: