పెమ్మసానికి వైసీపీ నుంచి సూపర్ ఆఫర్?

Purushottham Vinay
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. దానికి కారణం ఆయన ఆస్తులు. సుమారు రూ.5,700 కోట్లకు పైగా ఆస్తులను తన అఫిడవిట్ లో ప్రకటించిన పెమ్మసాని ఒక్కసారిగా రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిపోయారు.దీంతో ప్రస్తుతం యూట్యూబ్ అంతా ఆయన ఇంటర్వ్యూలు దర్శనమిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5700 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా ఈ రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థి.. 2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగినట్లు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అందువల్ల ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.ఇందులో భాగంగా... తాను 2019 వ సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి ఉన్నట్లు చెప్పిన పెమ్మసాని.. ఆ సమయంలో తనకు చాలా లాభదాయకమైన ఆఫర్లు కూడా వచ్చాయని తెలిపారు.


ఈ క్రమలోనే 2019 ఎన్నికల సమయంలో... వైఎస్సార్ కాంగ్రెస్‌ నుంచి తనకు ఏకంగా మూడు సూపర్ ఆఫర్లు వచ్చాయని పెమ్మసాని చెప్పుకొచ్చారు.ఇక ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ వైసీపీ తనకు 2019లోనే ట్రిపుల్ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. అందులో భాగంగా... గుంటూరు ఎంపీ టికెట్‌, నర్సరావుపేట ఎంపీ టిక్కెట్‌ లను ఆఫర్ చేసినట్లు కూడా తెలిపారు.ఇంకా ఇదే క్రమంలో... ప్రత్యక్ష ఎన్నికల్లో పోరు వద్దనుకుంటే... రాజ్యసభ సీటు కూడా తీసుకోవచ్చని వైసీపీ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని తనకు చెప్పినట్లు పెమ్మసాని తెలిపారు.అయితే... ఆ సమయంలో... జగన్ నుండి వచ్చిన ఈ ఆఫర్‌ లను తిరస్కరించినట్లు చెప్పిన పెమ్మసాని.. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా.. మరింత స్థిరంగా, తెలివిగా ఉన్నారని తాను ఎప్పుడూ భావించినట్లు చెబుతూ.. అందువల్లే తాను తెలుగుదేశంలోనే చేరాలని భావించినట్లు తెలిపారు.ఆ తరువాత ఇలా గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: