ఏపీ: జగన్ పై ప్రేమ..కింది లీడర్లపై కోపమా.. ఓటర్ నాడీ ఇదేనా.?

Pandrala Sravanthi
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ అయితే రాదు. ఏ నియోజకవర్గంలో చూసిన పోటాపోటీ వాతావరణం అయితే ఏర్పడింది. టీవీల్లో, పత్రికల్లో, ఉన్నవేవ్ జనాల్లో మాత్రం కనిపించడం లేదు. జననాడి చాలా డిఫరెంట్ గా ఉంది. వారు ఎవరికి ఓటు వేస్తారనేది కూడా చెప్పడం కష్టంగా మారింది.  నాయకులు ఏ విధంగా అవసరాలను బట్టి పార్టీలు మారతారో  జనాలు కూడా అన్ని పార్టీలలో తిరుగుతున్నారు. ఎవరు సభ పెట్టినా, ఎవరు మీటింగ్ పెట్టినా, ఆ సభా ప్రాంగణం మొత్తం నిండిపోతుంది. ఏ పార్టీ వాళ్లు ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారు అనేది వారి మదిలోనే ఉంచుకుంటున్నారు. ఇంకా 19 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందో చెప్పడం కష్టంగానే ఉంది. 

ఇదే తరుణంలో వైసిపి నాయకుడు జగనేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులను టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇక టిడిపి కూటమి నాయకులేమో ఏకపక్షంగా జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇలా బడాబడా నాయకులు మాత్రమే  మాట్లాడుతున్నారు, వార్తల్లోకి ఎక్కుతున్నారు.  ఈ నలుగురు ఓటేస్తే రాష్ట్రమంతా గెలవదు కదా. ఓట్లు వేయాల్సింది, వేయించాల్సింది కింది స్థాయి నాయకులు. గ్రామస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు. ఆ కార్యకర్తల గుణగణాలు,  పనితీరును బట్టి ఓట్లు కూడా పడుతాయి. ఓన్లీ జగన్ చూసి, చంద్రబాబును చూసి పవన్ కళ్యాణ్ ను చూసి ఓటు వేయరు. అలా వేసే రోజులు పోయాయి. మనకు ఏ ఎమ్మెల్యే మంచి చేస్తాడు. ఎమ్మెల్యే కింద ఉన్న నాయకుడు ఎలా ఉన్నారు అనేది గమనిస్తున్నారు. ఉదాహరణకు 2014, 2018 ఎన్నికల్లో కేవలం కేసీఆర్ ను చూసి తెలంగాణలో ఓట్లు వేశారు. ఆ టైంలో కేసీఆర్ కుక్కను నిలబెట్టిన గెలిచే పరిస్థితి ఉంది. ఆ విధంగానే జగన్ 2019లో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు.  

ఆ టైంలో ఆయన ఎవరిని నిలబెట్టిన గంపగుత్త ఓట్లు పడ్డాయి. ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు కూడా బాగున్నాయి.  ఈ పథకాలను కింది స్థాయికి తీసుకొచ్చే  విషయంలో మాత్రం విఫలమయ్యారు. గ్రామస్థాయిలో తెల్ల బట్టలు వేసుకొని తిరిగే నాయకులు  విభజించు పాలించు అనే విధంగా  మీరు మా పార్టీ కాదు, వారు మన పార్టీ కాదు అనే ధోరణి చూపించారట. దీనివల్ల చాలామంది పేదలకు ప్రభుత్వ పథకాలు అందలేదు. అంతేకాకుండా ఆ నాయకుడిని మళ్ళీ గెలిపిస్తే  ఈసారి మనకు ఏ విధమైన  పరిస్థితులు ఎదురవుతాయో అని జనాలు భయపడుతున్నారట. జగన్ కు ఓటు వేయాలి అనిపిస్తుంది, గల్లీలోని చోటామోటా లీడర్లను చూస్తే వద్దనిపిస్తుందట.  వీరి వల్ల ఓట్లు వేయాలనుకున్న  ప్రజలు మనసు మార్చుకొని  మరో పార్టీకి వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ప్రభుత్వం వస్తే దానిపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే ఈసారి జగన్ పై వ్యతిరేక ప్రభావం కూడా ఉంది. చోట మోటా నాయకుల  వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజలు  ఈసారి టిడిపి కూటమి వైపు చూస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: