వరంగల్ పోరు..కడియం చచ్చి బీఆర్ఎస్ ను బతికించారా..?

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీని వీడిన కడియం శ్రీహరి పై ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. పార్టీని వీడిన నేతల గురించి మాట్లాడుతూ.... కడియం శ్రీహరి చచ్చి వరంగల్ లో పార్టీని గెలిపించారు అంటూ కామెంట్ చేశారు. వరంగల్ లో బీఆర్ఎస్ అద్భుతమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీరే ఫలితాలను చూస్తారని అన్నారు.

బీ ఫామ్ ఇచ్చి రూ.10 కోట్ల డబ్బులు ఇచ్చారని ఆరోపణలు వినిపించాయని దీనిపై మీ స్పందన ఏంటని కేసీఆర్ ని అడగ్గా ఏ రాజకీయ పార్టీ కూడా తమ పార్టీకి సంబంధించిన విషయాలను బయటకు చెప్పదని అన్నారు. కానీ వరంగల్లో బీఆర్ఎస్ విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే... కడియం శ్రీహరి పార్టీని వీడిన తర్వాత ఆయనపై వ్యతిరేకత రావడం మాత్రం నిజమే అని అర్థమవుతుంది.

వరంగల్ రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.  కడియం శ్రీహరి మాదిగ ద్రోహి అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడంతో వారిలో వ్యతిరేకత నెలకొంది. కేసీఆర్ అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు టికెట్ కేటాయించారు. మారేపల్లి సుధీర్ కుమార్, వరంగల్ హనుమకొండ జిల్లా వాసి, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఆయన 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.   ఉమ్మడి వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉండడం... సుధీర్ కుమార్ పై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కడియం పార్టీని వీడటం స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: