ఈ టాప్ పొలిటిక‌ల్ వార‌సుల గాధ‌లు చూశారా...!

RAMAKRISHNA S.S.
- బాల‌య్య హ్యాట్రిక్‌.. పార్టీ పెట్టి సీఎం అయిన జ‌గ‌న్‌
- బాబు వార‌సుడిగా ఫ‌స్ట్ స్టెప్‌లోనే లోకేష్ ప్లాప్
- కేటీఆర్‌కు తండ్రికి త‌గ్గ గుర్తింపు
- మూడోసారి పోటీలో అయినా దేవినేని గెలిచేనా
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఒక‌ప్పుడు.. ఆస్తులు, వ్యాపారాల‌కు మాత్ర‌మే వార‌సులు ఉండేవారు. కానీ, మారుతున్న కాలంలో తండ్రు లు చేస్తున్న రాజ‌కీయాల‌కు.. త‌న‌యులు, త‌న‌య‌లు కూడా.. వార‌సులుగా వ‌స్తున్నారు. కొత్త‌గా వ‌చ్చిన వారిని ప‌క్క‌న పెడితే.. ఇప్పటికే వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రంగంలోకి దిగిన వారు ఎంత మంది స‌క్సెస్ అయ్యార‌నేది అంద‌రికీ ఆస‌క్తి క‌రం. వీరిలో కొంద‌రి స‌క్సెస్ స్టోరీలు ఇవీ..

బాల‌య్య‌:  
తండ్రి ఎన్టీఆర్ వార‌సుడిగా రంగంలో ఉన్న న‌ట‌సింహం  నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిరుగులేని విజ‌యం న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం హ్యాట్రిక్ కోసం.. పోరాటం చేస్తున్నారు.
జ‌గ‌న్:  
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడిగా రంగంలోకి దిగిన జ‌గ‌న్‌.. ఎంపీగా గెలిచారు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. సొంత పార్టీ పెట్టుకుని (వైసీపీ) ఏకంగా.. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించారు. ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న టీడీపీఅధినేత చంద్ర‌బాబును సైతం ఢీ అంటే ఢీ  అనేలా ఎదుర్కొంటున్నారు.

రామ్మోహ‌న్‌నాయుడు:  
తండ్రి  ఎర్ర‌న్నాయుడి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న రెండు సార్లు శ్రీకాకుళం పార్ల‌మెంటు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అజాత‌శ‌త్రువుగా పేరు తెచ్చుకున్న ఆయ‌న అన‌ర్గ‌ళంగా 4 భాష‌లు మాట్లాడ‌తార‌నే పేరుంది.(ఇంగ్లీష్‌-తెలుగు-హిందీ-ఒడియా). ఇది ఆయ‌న‌ను ప్ర‌జ‌ల‌కు, ఢిల్లీ నేత‌ల‌కు కూడా తేలికగా క‌నెక్ట్ చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
నారా లోకేష్‌:
తండ్రి చంద్ర‌బాబు వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నారా లోకేష్ 2014లో పార్టీని ముందుకు న‌డిపించి.. స‌క్సెస్ సాధించ‌డంలో మేటిగా నిలిచారు. గ‌త 2019 ఎన్నికల్లో మంగ‌ళ‌గిరి నుంచి ఓడిపోయారు. ఇప్పుడు మ‌రోసారి ఇక్క‌డ నుంచి ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దేవినేని అవినాష్‌:  
ఈయ‌న కూడా రాజ‌కీయ వార‌సుడిగా గుర్తింపు పొందారు. దేవినేని నెహ్రూ వార‌సుడిగా 2014లోనే రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఈయ‌న అప్ప‌ట్లో విజ‌య‌వాడ ఎంపీగా, 2019లో గుడివాడ ఎమ్మెల్యేగా(టీడీపీ త‌ర‌ఫున‌) పోటీ చేసినా.. విజ‌యం అందుకోలేక పోయారు. ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.
కేటీఆర్‌:
తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు. మాజీ సీఎం కేసీఆర్ త‌న‌యుడిగానే కాకుండా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాయించుకున్నారు. వ‌రుస విజ‌యాల‌తో మంత్రిగా కూడా ప‌నిచేశారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ గెలుపు గుర్రం ఎక్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: