తెలంగాణ : పెద్దపల్లి నుంచి అప్పుడు తండ్రి మరి ఇప్పుడు కొడుకు కూడా అదే రిపీట్ చేస్తాడా..?

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అన్ని మారాయి. కొంతకాలం క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హవా ఫుల్ జోష్ గా ముందుకు సాగింది. ఇక పోయిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీని సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయి మెజారిటీ సీట్లను సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీనితో ఒక్కసారిగా బీఆర్ఎస్ జోష్ కాంగ్రెస్ వెవ్ మొదలయ్యింది. ఇక మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే.

వాటిని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో పెద్దపల్లి ఎంపీ సీటు కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీని విషయంలో ఎప్పుడు భారీ పోటీనే ఉంటూ వస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి కాకా ఫ్యామిలీకి కొంచెం గట్టిగానే పట్టు ఉంది. ఇప్పటికే పెద్దపల్లి స్థానం నుండి కాకా కొడుకు అయినటువంటి వివేక్ పలుమార్లు గెలిచాడు. వివేక్ 2014 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేశాడు.

ఇక ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బాల్కా సుమన్ పై ఈయన ఓడిపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో ఈయన పెద్దపల్లి నుండి పోటీ చేయలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వివేక్ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, అతని సోదరుడు అయినటువంటి వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా పెద్దపల్లి ఎంపీ పరిధిలోనే ఉండడంతో వీరు మొదటి నుండి పెద్దపల్లి ఎంపీ సీటును వివేక్ కుమారుడు అయినటువంటి వంశీ కి ఆశిస్తూ వస్తున్నారు. దానితో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే ఈయనను పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.

దానితో ఈయన ప్రచారాలను కూడా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యే లుగా ఉండడంతో ఈయనకు భారీ క్యాడర్ ఈ ప్రాంతంలో ఉంది. దానితో అవలీలగా ఈయన ఈ ప్రాంతంలో గెలుస్తాడు అనే సమీకరణాలు ఇక్కడి ప్రజల్లో ఉన్నాయి. మరి ఇప్పటికే తన తండ్రి ఎంపీగా పని చేసిన ప్రాంతంలో కొడుకు కూడా తన జెండాను ఎగరవేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: