పవన్ కు ఐదో పెళ్లాం.. ఆమె వెయిటింగ్.. పోసాని విమర్శలతో పవన్ మారతారా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ పై ఇష్టానుసారం చేస్తున్న విమర్శల వల్ల జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ విమర్శలకు జగన్ కౌంటర్ ఇవ్వకపోయినా వైసీపీ నేతలు మాత్రం ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రధానంగా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
పవన్ కు నాలుగో పెళ్లాం ఉందని పవన్ వల్ల కాపుల ఆత్మగౌరవం తగ్గిపోతుందని పవన్ కాపుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని పోసాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దిగజారిపోతున్నారని ఆయన ఒక మెంటల్ కేస్ అని పోసాని విమర్శలు చేయడం గమనార్హం. ప్రజారాజ్యం పార్టీ నీటిబుడగలా పేలిపోవడానికి కాపుల మనోభావాలకు మెగాస్టార్ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమని పోసాని చెప్పుకొచ్చారు.
 
ప్రజారాజ్యం తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా చిరంజీవి పార్టీని కాంగ్రెస్ కు అమ్మేశారని ఆయన అన్నారు. చిరంజీవికి మాత్రం రాజ్యసభ పదవి వచ్చిందని ఆయన ఆ పదవితో సంతోషపడ్డారని పోసాని కృష్ణమురళి కామెంట్లు చేశారు. పవన్ కు ఐదో పెళ్లాం కూడా ఉందని ఐదో పెళ్లాం వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
పోసాని కృష్ణమురళి కామెంట్లు అయినా పవన్ ను మారుస్తాయేమో చూడాలి. హద్దులు మీరి పవన్ పదేపదే విమర్శలు చేయడం ద్వారా పార్టీ ఏ స్థాయిలో నష్టపోతుందో గుర్తించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి సున్నితంగా పవన్ పై విమర్శలు చేస్తూనే ఆయనకు భారీ షాకులిచ్చారని నెటిజన్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవచ్చని అయితే జనసేన అభ్యర్థులను మాత్రం గెలిపించుకోలేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోసాని కృష్ణమురళి కామెంట్ల గురించి పవన్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: