ఉండిలో ర‌ఘురామ కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ్‌... సొల్లు క‌బుర్లు చెప్పిన‌ట్టు కాదు సామీ..!

RAMAKRISHNA S.S.
- ప్యాకేజ్‌, ప‌ద‌వితో సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌ఘురామ సైలెంట్‌
- రెబ‌ల్‌గా మాజీ ఎమ్మెల్యే శివ రంగంలోకి..?
- టీడీపీ ఓట్లు చీలి ర‌ఘురామ‌కు గెలుపు క‌ష్ట‌మే..?
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
చేతికి అందిన పండు నేల‌రాలితేనే తీసి క‌డుక్కుని మ‌రీ తింటాం. అలాంటిది ఐదేళ్ల‌కు ఒక్క‌సార వ‌చ్చే అవ‌కాశం చేజారిపోతే.. తీసుకునేందుకు అవ‌కాశం కూడా లేకుండా పోతే.. ప‌రిస్థితి ఏంటి? అయినా.. ఆ నేత స‌ర్దుకుపోయారు. మ‌న‌సులో బాధ ఉన్నా.. పెద‌వి నుంచి బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఆయనే.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తొలిజాబితాలోనే టికెట్ ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌చారం కూడా ప్రారంభించుకున్నారు.

ఇంత‌లో మెల్లమెల్ల‌గా.. ఉండి స్థానంపై క‌ల‌క‌లం రేవండం తెలిసింది. ఇది నిజ‌మా?  కాదా? అని తెలుసు కునే స‌రికే.. నిజ‌మ‌ని తేలిపోయింది. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. టీడీపీలో చేరి.. ఉండి స్థానం ద‌క్కించుకున్నారు. ఈ ప‌రిణామ‌మే.. రామ‌రాజు మ‌న‌సును క‌రిగించేస్తోంది. అయినా.. ఆయ‌న స‌ర్దుకు పోయినా.. చంద్ర‌బాబు మాట‌కు వాల్యూ ఇచ్చారు. ఏకంగా ర‌ఘురామ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలోనూ రామ‌రాజు పాల్గొన్నారు. అయితే ఇక్క‌డ ప్యాకేజీ క‌థ న‌డిచింద‌ని.. రామ‌రాజుకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పార్టీ ప‌గ్గాలు కూడా ఇచ్చారు.

అయితే.. ఇక‌, క‌థ ముందుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నామినేష‌న్‌ను మాత్ర‌మే వేసిన ర‌ఘురామ‌కృష్ణ ఇక నుంచి ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాలి. ఇది ఆయ‌న‌కు తెలిసిన నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. స్థానిక నాయ‌కుల మ‌ద్ద‌తు అవసరం. దీనికితోడు.. క‌లువ‌పూడి శివ ఒంట‌రి పోరుకు రెడీ అయ్యారు. ఇది కూడా.. టీడీపీ ఓటు బ్యాంకును చీల్చే అవ‌కాశం ఉంది. ఇక‌, ప్ర‌స్తుతం మంతెన క‌లిసి న‌ట్టుగా ఉన్నా.. క్షేత్ర‌స్థా యిలో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను ఒప్పించే ప‌రిస్థితి లేదు. దీంతో ర‌ఘురామకు గెలుపు అంత ఈజీకాద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

టీడీపీకి ఉండి కంచు కోట అన్నది వాస్త‌వం. ఇక్క‌డ వైసీపీ బోణీ కూడా కొట్ట‌లేదు. అయితే.. ఇప్పుడు తాము గెలిచి తీరుతామ‌ని ఆ నాయ‌కులు చెబుతున్నారు. దీనికి కార‌ణం.. టీడీపీలో ఏర్ప‌డిన విభేదాలు. అందుకే చంద్ర‌బాబు గెలిచే సీటును చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేశారు. కానీ, ఇప్పుడు చేతులు క‌లిసినా.. మ‌న‌సులు క‌లిసే ప‌రిస్థితి నాయ‌కుల మ‌ధ్య క‌నిపిస్తోంది. దీనికితోడు పార్టీ నుంచి రెండు సార్లు గెలిచిన క‌లువ పూడి శివ కూడా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఉండిలో ప్రాథ‌మిక స‌మ‌స్య తీరినా.. అస‌లు ప‌రీక్ష ముందుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: