ఏపీ: సంక్షేమమా.. అభివృద్ధా.. వెనుకబడిందెవరు..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి ఓరేంజ్ లో కొనసాగుతోంది.. అధికారాన్ని మరొకసారి చేపట్టాలని వైసిపి పార్టీ భావిస్తున్న టిడిపి అయితే ఈసారి కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉన్నది.. ఇలా రెండు పార్టీలు కూడా కసితో పని చేస్తున్నాయి. అయితే 2014 నాటికి జగన్ చంద్రబాబు అన్నట్లుగా రాజకీయాలలో బచ్చ కావచ్చు ఏమో కాని.. 2019 వచ్చేసరికి రాజకీయాలలోని ఒక చరిత్రను సృష్టించారు జగన్. అయితే ఇప్పుడు 2024 నాటికి  ఐదేళ్లగా సీఎం పని చేసి చంద్రబాబును ఢీకొడుతున్నారు జగన్.

ముఖ్యంగా ఇద్దరూ కూడా సీఎం గా పని చేసిన వారు కావడం చేత ఎక్కడా కూడా అనుభవం గురించి ప్రస్తావించే అవకాశం లేదు.. 2014 నుంచి 19 దాకా టిడిపి ప్రభుత్వం పాలనలో అలాగే 2019 నుంచి 24 వరకు జగన్ పాలన చూసి ప్రజలు తీర్పు ఇవ్వవచ్చు అనే విధంగా కనిపిస్తోంది. ఒకవైపు జగన్ చూస్తే సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని అడుగుతూ ఉండగా ఏపీలో 80% వరకు పథకాలను అందించాము కాబట్టి వైసిపి వైపే ప్రజలు ఉన్నారనే విధంగా ఆ పార్టీ ధీమా ను తెలియజేస్తోంది.

టిడిపి సంక్షేమం ఏమీ చేయలేదు బాబు మార్క్ పథకం ఒకటి కూడా లేదంటూ సిద్ధం సభలలో కూడా జగన్ తెలియజేశారు. కేవలం పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టిడిపి ఉదరా కొడుతోంది అంటూ జగన్ చేసిన సంక్షేమం కంటే తాము ఎక్కువ చేస్తామంటూ తెలియజేస్తోంది టీడీపీ. అయితే టిడిపి మాత్రం ఆంధ్రాలో అభివృద్ధి ఎక్కడ అంటూ పదే పదే ప్రశ్నిస్తోంది. దీంతో వైసిపి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా కూడా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎక్కువగా సంక్షేమంపైనే శ్రద్ధ పెట్టింది. అభివృద్ధి మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు.

ఈ విషయం పైన వైసిపి కచ్చితంగా బ్యాలెన్స్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా రోడ్లు సరిగ్గా లేవని వైసీపీ ప్రభుత్వం పైన కాస్త వివక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు జగన్ ఎక్కడ చేసినా కూడా ప్రసంగాలలో సంక్షేమ పథకాల గురించి ఉన్నాయి. మళ్లీ గెలిచిన మళ్లీ అదే పథకాలు కంటిన్యూ చేస్తానని చెబుతున్నారు. అయితే ఏపీలో అభివృద్ధి కోరుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలలో చాలా బలంగా తీసుకువెళ్లాల్సి ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రాలో 17 మెడికల్ కాలేజీలు ,గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కెలు, ఆ నాడు నేడు కింద స్కూళ్లు బాగోగులు, వైద్యులు అన్నీ కూడా చూపిస్తున్నారు.

కానీ ఏపీ రాజధాని తో పాటు పోలవరం పూర్తి చేస్తామని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కరన కాకుండా చేస్తామని, ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పాల్సి ఉన్నది. కానీ ఈ విషయంలో మాత్రం వైసిపి వెనుకబడి ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: