గుడ్డ కాల్చి మొహాన వేస్తున్న చంద్రబాబు.. రెబల్స్ రూపంలో పరువు పోవడం ఖాయమా?

Reddy P Rajasekhar
ఏ పార్టీకి అయినా అధినేత అయిన వ్యక్తికి కొన్ని విలువలు ఉండాలి. ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించిన తర్వాత ఆ మాటకు కట్టుబడి రాజకీయాలు చేయాలి. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఇతర రాజకీయ నేతలకు భిన్నం అని చెప్పవచ్చు. ఐదు స్థానాలలో చంద్రబాబు అభ్యర్థులను మార్చడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల వేళ టీడీపీ రోడ్డున పడిందంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సొంత పార్టీలోనే రచ్చలు రేగడంతో షాకవ్వడం ఆ పార్టీ నేతల వంతవుతోంది. మడకశిర నియోజకవర్గంలో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అయితే టికెట్ ఇస్తామని ఆశ చూపి డబ్బులు ఖర్చు చేయించి చివరకు ప్లేటు ఫిరాయించడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మార్పు నిర్ణయాలతో ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటమి ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మడకశిర నియోజకవర్గంలో స్థానికేతరుడు అయిన వ్యక్తికి టికెట్ కేటాయించారు. టీడీపీ నుంచి టికెట్లు దక్కని నేతలు రెబల్స్ రూపంలో పార్టీకి భారీ షాకిచ్చే అవకాశాలు ఉంటాయి. అభ్యర్థుల మార్పు వల్ల ఒక అభ్యర్థి విజయానికి మరో అభ్యర్థి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబుకు ఈ ఎన్నికలు విషమ పరీక్ష అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఎన్నికల్లో కూటమి ఓటమిపాలైతే మాత్రం అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తాయని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అనుభవం ఈ ఎన్నికలకు ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. చంద్రబాబుకు జగన్ వరుస షాకులిస్తూ తన వ్యూహాలతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శల ద్వారా కూటమికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మోదీ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లు కూటమికి నష్టం కలిగించే ఛాన్స్ అయితే ఉంది. చంద్రబాబు గుడ్డ కాల్చి మొహాన వేస్తూ పార్టీకి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: