నాలుగో పెళ్లాం, పరదాల మహారాణి.. సెన్సార్ కట్స్ భాష అవసరమా పవన్?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఎవరైనా చిరంజీవిపై నెగిటివ్ కామెంట్లు చేస్తే అస్సలు తట్టుకోలేరు. తన అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇస్తారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం జగన్ విషయంలో రాయడానికి కూడా అభ్యంతరకర భాషలో విమర్శలు చేస్తున్నారు. నాలుగో పెళ్లాం, పరదాల మహారాణి అంటూ పవన్ చేస్తున్న నెగిటివ్ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
జగన్ పాలన గురించి ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చని ఆయన వ్యక్తిగత జీవితంలో తప్పులు ఉంటే విమర్శించవచ్చని అంతే తప్ప ఈ సెన్సార్ కట్స్ భాష అవసరమా పవన్? అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ పవన్ పెళ్లిళ్లపై తరచూ విమర్శలు చేస్తాడు కానీ మరీ వ్యక్తిత్వాన్ని కించపరిచే స్థాయిలో జగన్ విమర్శలు ఉండవు. పవన్ కళ్యాణ్ మాత్రం వ్యక్తిగత ద్వేషంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన కామెంట్లు వింటే అర్థమవుతుంది.
 
2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందో వైసీపీ అధికారంలోకి వస్తుందో తెలీదు. 21 స్థానాలలో జనసేన పోటీ చేస్తుండగా కనీసం సగం స్థానాలలో అయినా ఆ పార్టీ విజయం సాధిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జగన్ సర్కార్ పవన్ సినిమాలను టార్గెట్ చేస్తే హిట్ టాక్ వచ్చిన పవన్ సినిమాలకు సైతం భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.
 
పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్గ్యలను పవన్ అభిమానులు సైతం హర్షించరు. చిరంజీవి పాలిటిక్స్ లో కెరీర్ కొనసాగించినన్ని రోజులు సద్విమర్శలు చేశారే తప్ప ఆయన తన స్థాయిని తగ్గించుకుని ఎప్పుడూ కామెంట్లు చేయలేదు. రాజకీయాల్లో దీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూట్రల్ ఓటర్లను సైతం దూరం చేసుకునేలా పవన్ ప్రవర్తన ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: