పవన్ : మళ్ళీ జ్వరం.. అలాంటి సమస్యతో ఉక్కిరి బిక్కిరి..!

Divya
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పలు రకాల ప్రాంతాలను చుట్టేస్తూ ఉన్నారు. అయితే అలా చుట్టేసిన కేవలం రెండు మూడు రోజులకే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇలా రెండు మూడు సార్లు ఇబ్బందులు పన్నా ఇప్పుడు మళ్లీ జ్వరం బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఇంతగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు ఏంటో అని ప్రశ్నించారు.

ఇటీవల కాలంలో తరచూ పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ హైదరాబాద్ కు వెళ్లడం కోలుకున్న వెంటనే మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ విషయం అటు అభిమానులను కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని దీనివల్ల ప్రతిరోజు ఏదో ఒక సమయంలో జ్వరం వస్తోందట. ఇన్ ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాలనుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఇబ్బందులలో కూడా వారాహి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. తరచూ జ్వరం రావడంతో  పవన్ తన ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా తీసుకోవాలని వైద్యుల సైతం ఆయనను సూచిస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చినప్పుడు భారీ పూలదండలు ఏర్పాటు చేయవద్దంటూ అభిమానులకు సూచన ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సెల్ఫీలు ఫోటోలు షేక్ హ్యాండ్స్ తీసుకోవద్దని.. అలాగే పూలు చల్లే విషయంలో కూడా ఆయనకు తగిలేలా చల్ల పలు రకాల సూచనలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల.. అభిమానులకు ఈ విషయాన్ని సూచిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం జనసేన పార్టీ ప్రచారానికి సమస్యగా మారుతోందని మాట పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. మరి ఈ సూచనలన్నీ జనసేన సైనికులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: