ఏపీ: కూటమి గెలిస్తే.. ఆయనే హోం మినిస్టర్..?

Divya
2019 ఎన్నికలలో వైసిపి రెబల్ ఎంపీగా ప్రజలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రఘురామకృష్ణంరాజు.. ఆ తర్వాత వైసీపీ పార్టీ నుంచి దూరమై నరసాపురం ఎంపీగా బిజెపి టికెట్ మీద పోటీ చేయాలనుకున్నారు.. కొన్ని కారణాల చేత టికెట్ రాకపోవడంతో మళ్లీ చంద్రబాబు సహాయంతో టిడిపిలోకి చేరి ఉండి అసెంబ్లీ సీట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఉండి లో భారీ మెజారిటీతో నెగ్గుతానంటూ రఘురామ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ తెలియజేశారు.

ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ లో రఘురాజు కృష్ణంరాజు మాట్లాడుతూ తాను టిడిపి ఎమ్మెల్యేగా ముఖ్య పాత్ర పోషిస్తున్నానని అయితే ఈసారి మీరు స్పీకర్గా కనిపిస్తారా అన్నదానికి సమాధానాన్ని తెలియజేస్తూ.. అభిమానులు తనను ఇష్టపడేవారు ఇలా కోరుకుంటూ ఉంటారంటూ నవ్వులు చిందించారు. దీన్నిబట్టి చూస్తే రఘురామాకు ఏదో పెద్ద పదవి మీద ఆశ ఉందనేలా కనిపిస్తోంది.. ముఖ్యంగా రఘురామకు హోం మినిస్టర్ పదవి ఇస్తారనె ప్రచారం కూడా ఈ నేపథ్యంలోనే మొదలయ్యింది. అయితే ఈ విషయం పైన కేవలం రఘురామ నవ్వుతూ ఆస్వాదించారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా టిడిపి తనకు టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు.. ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పులు చేసిన వారికి చాలా కఠినంగా శిక్షిస్తాం అంటూ కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే రఘురామ మనసులో కూడా హోం మినిస్టర్ పదవి మీదే ఆశ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఉండి టిడిపి అభ్యర్థిగా రఘురామ పోటీ చేస్తూ ఉండడంతో.. గతంలో అక్కడ అభ్యర్థిగా ఉన్న రామరాజు తో చంద్రబాబు చర్చించి సీటు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపైన పలువురు చాలామంది..ఇంకా రామరాజు నామినేషన్ దాఖలు చేసి.. ఎమ్మెల్యేగా ప్రచారం చేయాలి.. వీటితో పాటు విజయం కూడా సాధించాలి అప్పుడే టిడిపి కూటమి ఏర్పడాలి.. అప్పుడే కదా ఆయనకు మినిస్టర్ పోస్ట్ వచ్చేది అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: