ఏపీ: కీలక సమయంలో తన గొయ్యి తానే తవ్వుకుంటున్న పవన్ కళ్యాణ్..??

Suma Kallamadi
పవన్ కళ్యాణ్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ నాయకుడికి పోటీగా వైసీపీ అభ్యర్థి వంగా గీత నిలబడ్డారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇంకా ఎన్నికల తేదీకి 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అయితే ఆయన సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకే నచ్చడం లేదని చర్చ జరుగుతోంది.
ఇటీవల ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి గురించే పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడుతున్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏమవుతుంది అన్నట్లు ఆయన ఇన్సెన్సిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇది ఒక డ్రామా అని, పులి మేక కథను మళ్లీ మళ్లీ చెప్తే సానుభూతి ఎలా లభిస్తుంది అని  మాట్లాడుతున్నారు. తోటి రాజకీయ నాయకుడికి కన్ను పోయే పని అయింది. అది చిన్న దెబ్బ ఏం కాదు చాలా పెద్ద దెబ్బె. ఆ రాయి కూడా గులకరాయి కాదు, పెద్ద రాయి! దెబ్బ తగిలి జగన్ ముఖమంతా కమిలిపోయింది. అది చూసిన ఎవరికైనా సానుభూతి కలుగుతుంది కానీ పవన్ మాత్రం ఆ ఘటన గురించి జోకులు చేస్తూ నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
గెలిస్తే ఏపీ ప్రజల కోసం తన పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. గెలిపిస్తే ప్రజల కోసం ఫలానా పనిచేస్తానని చెప్తే ఓటు చెయ్యకూడదు అని అనుకునే వారు కూడా వేసే అవకాశం ఉంది కానీ ఒకరిని ఇష్ట రాజ్యాంగా తిడితే చాలు తనకి ఓట్లు పడతాయని భావించడం సబబు కాదు అని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. పిఠాపురంలో ప్రజలు ఇలాంటి మాటల ధోరణిని అసలు మెచ్చరు అని కూడా అంటున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అనే ముద్ర పడిపోయింది. పార్టీలు మారుతూ జగన్ కి తాను మొగుడు అవుతానంటూ చాలా దిగజారి ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి మాటలతో ఆయన ఓడిపోతే పొలిటికల్ కెరీర్ కి చెక్ పడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: