జగనోరు నుంచి అన్ని కోట్లా? షాకిస్తున్న షర్మిళ అప్పులు!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సొంత అన్నా చెల్లెళ్లన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్న ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపేయాలని షర్మిల అల్టిమెట్ ఎయిమ్ తో దూసుకుపోతున్నారు. ఎంతలా అంటే తాను ఓడినా పర్వాలేదు తన అన్న జగనోరు గెలవకూడదు అనేంతలా దూసుకుపోతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించడమే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇదంతా గమనిస్తున్న వారు.. వీరిద్దరి మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయని.. సీఎం జగన్ ఆస్తులు పంచకుండా షర్మిలను వేధిస్తున్నారని.. చర్చించుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే.. తాజాగా షర్మిల.. కడప పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె తనకున్న అప్పులు, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి వివరించారు.


ఇందులో చాలా ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించడం గమనార్హం. తన ఆస్తులను రూ.182 కోట్లుగా పేర్కొన్న షర్మిల.. తన అప్పులను కూడా వివరించారు. తనకు మొత్తం 82 కోట్ల, 77 లక్షల, 71 వెయ్యి 682 రూపాయల అప్పు ఉందని  పేర్కొన్నారు. అయితే.. ఇంత అప్పు బయటి వారి నుంచి తీసుకున్నట్టు చెప్పలేదు.తన తోబుట్టువు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి 82 కోట్ల, 58లక్షల,15 వేలను అప్పుగా తీసుకున్నారు.అలాగే తన వదిన, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి 19లక్షల, 56 వేల, 682 రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు ఆమె అఫిడవిట్‌లో వివరించారు. మొత్తంగా జగన్ దంపతులకు వైఎస్ షర్మిల ఏకంగా రూ.82 కోట్ల రూపాయలకు పైగా అప్పు పడ్డారు. అయితే.. ఇదంతా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నట్టు ఆమె వివరించారు.ఈ పరిణామం అనేది తాజాగా జరుగుతున్న ఆస్తుల వివాదంలో కీలకంగా మారింది. ఇప్పటి దాకా షర్మిలకు ఆస్తులు పంచడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌ మోహన్ రెడ్డి ఆమెకు అప్పులు ఇవ్వడం ఏంటనేది చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: