ఉత్తరాంధ్ర: బాబోరు Vs జగనోరు.. గెలిచేదెవరు?

Purushottham Vinay
ఉత్తరాంధ్ర ఇప్పుడు రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది.ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉంటాయి. ఉమ్మడి విశాఖలో 15 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఉమ్మడి విజయనగరంలో 9 ఇంకా ఉమ్మడి శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఇందులో రాజకీయ సమీకరణలు చూస్తే  ఉమ్మడి విశాఖలో ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి బాగా పట్టు ఉంది. అక్కడ రెండు సీట్లూ ఆ పార్టీక దక్కుతాయి. ఇక రూరల్ విశాఖ జిల్లాలో అయితే గతంలో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది. ఈసారి అలా ఉండకపోవచ్చు.ఎందుకంటే ఈసారికి టీడీపీకి పట్టు పెరిగింది. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా హెరాల్డ్ సర్వేలో తెలిసింది. అలాగే విశాఖ సిటీ పరిధిలో ఉన్న ఆరు సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని అంటున్నారు. ఓవరాల్ గా  ఉమ్మడి విశాఖలో టీడీపీకే కొంత పట్టు ఉందని చెప్పాల్సి ఉంది.అయితే విశాఖ సిటీ పరిధిలో మాత్రం బీజేపీకి కొంత పట్టు ఉంది. అలగే ఉత్తరాది జనాభాతో పాటు మార్వాడి, ఇతర వ్యాపార కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు బీజేపీకి సపోర్ట్ గా ఉంటున్నాయి. దాని వల్ల కూడా కూటమికి కొంత రాజకీయ లాభం జరుగుతుందని అంటున్నారు.


ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది.ఈసారి కూడా మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు. తొమ్మిదిలో ఆరు నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కవచ్చు.బలమైన బీసీ నేతలు ఈ జిల్లాలో వైసీపీ వైపు ఉన్నారు. టీడీపీలో ధీటైన నేతలు లేకపోవడం వల్ల వైసీపీకి అనుకూలించే అంశగా ఉంది.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. కానీ 2019లో మాత్రం వైసీపీ ఏకంగా పది ఎమ్మెల్యే సీట్లకు గానూ ఏకంగా ఎనిమిదింటిని గెలుచుకుంది. దాంతో అక్కడ టీడీపీ రాజకీయం బోల్తా కొట్టింది.అయితే టీడీపీ గడచిన అయిదేళ్లలో మళ్ళీ బాగా పుంజుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి బలమైన నేతలు జిల్లాలో ఉన్నారు. వైసీపీకి కూడా ధీటైన నేతలు ఉన్నారు. టీడీపీని కింజరాపు ఫ్యామిలీ నడిపిస్తూంటే వైసీపీని ధర్మాన ఫ్యామిలీ నడిపిస్తోంది. దాంతో ఇక్కడ నువ్వా నేనా  అన్నట్లుగానే పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉన్న పది అసెంబ్లీ సీట్లలో చెరో అయిదు సీట్లూ టీడీపీ వైసీపీ పంచుకోవచ్చని తెలుస్తోంది.మొత్తం మీద 2014లో టీడీపీకి మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్రాలో దక్కాయి. 2019లో మాత్రం వైసీపీకి దక్కాయి. కానీ ఈసారి ఏ పార్టీకి దక్కుతాయో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: