దొరకని గుర్తింపు.. రాములమ్మ మళ్ళీ పార్టీ మారతారా?

praveen
ఆమె ఒక ఫైర్ బ్రాండ్.. ఎలాంటి విషయం పైన అయిన అనర్గళంగా మాట్లాడగలదు. ప్రత్యర్ధుల తప్పులను ఎత్తిచూపుతూ విమర్శలతో విరుచుకు పడగలదు.  అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు పెట్టారు. కానీ ఇప్పుడు అలాంటి ఫైర్ బ్రాండ్ ఆచూకీ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ కనిపించడం లేదు. ఇక రాష్ట్రమంతటా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంటే ఆమె మాత్రం ఎక్కడ తెరమీద లేనే లేదు.

 ఆమె ఎవరో కాదు సినీ నటి విజయశాంతి   తెలంగాణ ప్రజలందరూ రాములమ్మ అని కూడా పిలుచుకుంటారు  గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది  ఇలాంటి సమయంలో ఫైర్ బ్రాండ్ గా పేరు ఉన్న కాంగ్రెస్ నేత విజయశాంతి మాత్రం ఎక్కడ ప్రచారంలో తలుక్కుమనడం లేదు. ఇప్పటికే తనకు ప్రాధాన్యత లేదు అంటూ ఎన్నో పార్టీలు మారుతూ వచ్చిన విజయశాంతికి ఇక ఇప్పుడు కాంగ్రెస్ లోను ఇలాంటి పరిస్థితి ఉంది అనే టాక్ ఉంది. బిజెపితో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇక ఆ పార్టీని బిఆర్ఎస్ లో విలీనం చేశారు. తర్వాత బిఆర్ఎస్ నుంచి 2014లో కాంగ్రెస్లోకి వెళ్లారు. ఇక ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో మళ్ళీ కాషాయ కండువా కప్పుకున్నారు. 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారు.

 ఇలా సరైన గుర్తింపు కోసం ఎన్ని పార్టీలు మారిన అటు విజయశాంతికి మాత్రం ప్రతిచోట ఒకే రకమైన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక విజయశాంతి ప్రచార కమిటీ ప్లానింగ్ కమిటీ చీప్ కోఆర్డినేటర్ కన్వీనర్ గా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విజయశాంతి ఎక్కడ కనిపించడం లేదు. అయితే గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన అనుభవమున్న విజయశాంతిని ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు వినియోగించుకోవట్లేదు అన్నది హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇలా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి మళ్ళీ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారూ అనే చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mdk

సంబంధిత వార్తలు: