మెదక్ : సీఎం రేవంత్.. ఆమెనెలా మరిచిపోయాడబ్బా ?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తికాగా సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రమంతటా తిరుగుతూ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు హస్తం పార్టీలోని కీలక నేతలందరూ కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు అని చెప్పాలి.

 అయితే కెసిఆర్ సొంత జిల్లా అయినా మెదక్ పార్లమెంట్ స్థానంలో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థి నీలం మదును బరిలోకి దింపింది కాంగ్రెస్. అయితే సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ తో కలిసి ఇక నీల మదును గెలిపించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం నామినేషన్ సమయంలో ఇక నీలం మదుకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ నేత మాత్రం ఇక ఇప్పుడు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

 ఆమె ఎవరో కాదు విజయశాంతి. గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీప్ కోఆర్డినేటర్ గా కూడా కొనసాగుతున్నారు ఆమె. అయినప్పటికీ ప్రచారంలో ఎక్కడ తలుక్కుమనడం లేదు. కాంగ్రెస్ ఆమెను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే చర్చ మొదలైంది. సినీనటిగా రాజకీయ నాయకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విజయశాంతిని కూడా మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో వాడుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారట. మెదక్ లో గెలిచేందుకు ఏ చిన్న చాన్స్ ఉన్న వదులుకోవడానికి ఇష్టపడని రేవంత్ విజయశాంతిని ఎందుకు పక్కన పెట్టారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న రోజుల్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఈ ఫైర్ బ్రాండ్ నేత సేవలను  వాడుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mdk

సంబంధిత వార్తలు: