రాయలసీమ (ప్రొద్దుటూరు): వరద రాజుల రెడ్డికి గెలుపు కష్టమేనా..బయటపడితే అదృష్టమే..!

Divya
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా హీటేక్కిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు రాజకీయం ఈసారి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.. వైసీపీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా.. టిడిపి పార్టీ నుంచి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు.. మొదట అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించగా ఆయనకు మొండి చెయ్యి ఎదురయ్యింది. అలాగే మరొక మాజీ ఎమ్మెల్యే మల్లెల రంగారెడ్డి కూడా టిడిపి టికెట్ ఆశించినా.. ఆయనకు కూడా నిరాశ మిగిలింది.

టిడిపి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జండా మోసిన తమను కాదని. ఎన్నికల సమయంలో వచ్చిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఇద్దరు నాయకుల సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ప్రవీణ్ రెడ్డి , లింగారెడ్డి ఇద్దరు కూడా వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రవీణ్ పైన కూడా చాలా కేసులు ఉన్నాయని.. శివ ప్రసాద్ రెడ్డి పైన పోరాడుతున్న సమయంలో వరదరాజుల రెడ్డి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.. కానీ ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ప్రవీణ్ మాత్రం అక్కడ బాగానే పేరు సంపాదించారు.

అయితే జైల్లో ఉన్న ప్రవీణ్ ను  లోకేష్ పరామర్శించడానికి కూడా వెళ్లారు. ఆ సమయంలో లోకేష్ ప్రవీన్ ను అక్కడ అభ్యర్థి అంటూ కూడా ప్రకటించారు.. దీంతో యువ గళం పాదయాత్రలో భాగంగా కూడా లోకేష్ వెళ్ళినప్పుడు ప్రవీణ్ ఇక్కడ పోటీ చేస్తారనే విధంగా ప్రకటించారు.. అయితే ఇలా కేవలం రాజకీయ పనుల కోసమే ప్రవీణ్ ను , లింగారెడ్డిని వాడుకున్నట్లు ఇప్పుడు వారికి అర్థమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాము మోసపోయామని గ్రహించిన లింగారెడ్డి,  ప్రవీణ్ ఇద్దరూ కూడా ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వరదరాజులకు టికెట్ ఇవ్వడం పైన కూడా ఈ ఇద్దరు నేతలకు ఇష్టం లేదు.. దీన్ని బట్టి చూస్తే ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి గెలుపు కష్టమే అన్నట్లుగా కనిపిస్తోంది.. మరి  ఏదైనా అదృష్టం కలిసి వస్తే తప్ప బయటపడడం చాలా కష్టమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: