వైసిపి:ఎన్నికలవేళ మంత్రి పదవుల లొల్లి..గెలిచినట్టేనా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కొలాహలం నడుస్తోంది. ఇప్పటికే నాయకులంతా వారి వారి నియోజకవర్గాల్లో  ప్రచారంలో మునిగిపోయారు. ఇంకా 23 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇదే తరుణంలో అభ్యర్థులంతా వారి వారి స్పీడ్ ను పెంచేశారు.  ఓవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే టిడిపి కూటమి కూడా  ప్రచారంలో పరుగులు పెడుతోంది. ఇదే తరుణంలో వైసీపీ పార్టీలో ఒక కొత్త  విషయం తెరపైకి వచ్చింది. ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు, ఎన్నికలు ఇంకా జరగలేదు పార్టీ అభ్యర్థులు గెలవలేదు, అసలు ఎవరు గెలుస్తారో తెలియదు, ఇవన్నీ కాకముందే వైసిపి నాయకులంతా మంత్రి పదవులకు సంబంధించి లెక్కలు చేసుకుంటున్నారట.

 ఈసారి జగన్ మంత్రివర్గంలో నాకు చోటు ఉంటుందని మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ నాకు హామీ ఇచ్చాడని  వైసిఫీ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో నేను తప్పనిసరిగా ఉంటానని  వారికి వారే ఆనంద పడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా గెలుపు ఓటమి ప్రజల నిర్ణయం.  ఎవరు గెలుస్తారు అనేది కచ్చితంగా చెప్పలేం. ప్రతి నియోజకవర్గంలో చాలా టైట్ పొజిషన్ ఉంది. ఇదే తరుణంలో చాలా సర్వేలు కొన్ని వైసీపీకి సపోర్టుగా వస్తే మరికొన్ని టిడిపికి సపోర్టుగా వస్తున్నాయి. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ తానే వస్తాడని కాన్ఫిడెన్స్ తో ఉన్నారట.  

అంతేకాకుండా వైసిపి అభ్యర్థులకు  మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చారట. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పుకుంటూ వస్తున్నారట. ఇందులో ముఖ్యంగా మారగాని భరత్  ప్రస్తుత రాజమండ్రి ఎంపీగా ఉన్నారు.  ఈసారి రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తను గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని భరోసా ఇచ్చారట. అంతేకాకుండా ఆమధ్య కుప్పంలో పోటీ చేసిన  భరత్ కూడా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారట. ఈ విధంగా జగన్ గెలవకముందే  కొంతమందికి మంత్రి పదవులు ఇస్తానని ఆశ చూపి వారిని మరింత కీలకంగా ప్రచార

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: